Best Rice for Weight Management : ఆరోగ్యానికి ఏ బియ్యం మేలు..? బరువు, మధుమేహం నియంత్రణకు సరైన ఎంపిక ఇదే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారతీయ వంటకాల్లో బియ్యం ప్రధాన ఆహారం. మన దేశంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్, బాస్మతి సహా అనేక రకాల సాంప్రదాయ బియ్యాన్ని నిత్యం ఉపయోగిస్తుంటారు. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజల్లో ఆరోగ్యం, బరువు, రక్తంలో చక్కెర స్థాయిల పట్ల అవగాహన పెరిగింది. దీంతో మనం రోజూ తినే అన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? అన్న సందేహం చాలామందిలో కలుగుతోంది. మీ వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి రోజూవారీ ఆహారంలో ఏ బియ్యాన్ని ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?

 

1. బ్రౌన్ రైస్.. 

ఇది పాలిష్ చేయని, తక్కువగా ప్రాసెస్ చేసిన బియ్యం. వీటిపై ఉండే తవుడులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రోజుల్లో ఆరోగ్య నిపుణులు ఎక్కువగా సూచిస్తున్నది బ్రౌన్ రైస్‌నే.

ప్రయోజనాలు ఏమిటి..? పీచుపదార్థం (fiber) అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది, త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక. తెల్ల బియ్యంతో పోలిస్తే దీన్ని వండటానికి ఎక్కువ సమయం పడుతుంది, రుచి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది.

2. రెడ్ రైస్..

ఈ ఎర్ర బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ప్రయోజనాలు ఏమిటి..?..ఇందులోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి సహాయపడతాయి.

3. బ్లాక్ రైస్..

ఈ బియ్యంలో ఆంథోసియానిన్స్ (Anthocyanins) అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవే వీటికి సహజమైన నలుపు రంగును ఇస్తాయి. ప్రయోజనాలు ఏమిటి..? సాధారణ బియ్యంతో పోలిస్తే ఇది అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

4. వైట్ రైస్..

మనలో ఎక్కువమంది నిత్యం వాడేది ఈ తెల్ల బియ్యాన్నే. బియ్యాన్ని తెల్లగా నిగనిగలాడేలా పాలిష్ చేయడం వల్ల పై పొరలోని పోషకాలు, ఫైబర్ చాలా వరకు నశించిపోతాయి.ప్రయోజనాలు ఏమిటి..? ఇది సులభంగా జీర్ణమై, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ, ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు అధికంగా ఉంటాయి. మోతాదుకు మించి తింటే బరువు పెరగడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.

మధుమేహులు, బరువు తగ్గాలనుకునే వారి కోసం..

మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు పాలిష్ చేసిన తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్ వంటి ముడి బియ్యాన్ని ఎంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అయితే, కేవలం ఏ బియ్యం తింటున్నాము అన్నదే కాకుండా, ఎంత పరిమాణంలో తింటున్నాము అన్నది కూడా ముఖ్యం. ఏ రకం బియ్యం తిన్నా మోతాదు మించకుండా చూసుకోవాలి. అన్నంతో పాటు తాజా కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు తీసుకుంటేనే శరీరానికి సంపూర్ణ పోషకాలు అందుతాయి.

 

ఇది కూడా చదవండి..Myth or Fact : బరువు తగ్గడానికి గోరువెచ్చని నీరు, తేనె.. ప్రచారమా.. వాస్తవమా..?

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.