Stay Happy Naturally : శరీరంలోని 4 రకాల రసాయనాలను పెంచుకుంటే హ్యాపీగా ఉండొచ్చు..!
సాక్షి లైఫ్ : ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. చిన్నలైనా, పెద్దలైనా మహిళలైనా, పురుషులైనా అందరూ కోరుకునేది అదే.. మనం సంతోషంగా ఉన్నామా..? లేదా ఆందోళనగా ఉన్నామా..? అనేది ప్రధానంగా మన శరీరంలో ఉండే నాలుగు రకాల రసాయనాలపై ఆధారపడి ఉంటుంది. అవేంటంటే..? డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు. వీటిని పెంపొందించు కుంటేనే ఎలాంటి ఒత్తిడి లేకుండా మరింత సంతోషంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి రసాయనాలను పెంచుకోవాలంటే ఏమి చేయాలి..? అనేది ఇప్పడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
1. డోపమైన్ (Dopamine) 'రివార్డ్' హార్మోన్..
మనం ఏదైనా సాధించినప్పుడు కలిగే తృప్తి వెనుక డోపమైన్ హార్మోన్ ఉంటుంది. దీనిని 'రివార్డ్' హార్మోన్ అని కూడా అంటారు. డోపమైన్ హార్మోన్ పెరగాలంటే ఏమి చేయాలి మరి..?.. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటిని పూర్తి చేయాలి. బాగా ఇష్టమైన సంగీతం వినడం, మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ హార్మోన్ ను పెంచుకోవచ్చు.
2. సెరోటోనిన్ (Serotonin) 'మూడ్ స్టెబిలైజర్'.. ఈ హార్మోన్ మన మూడ్‌ని నియంత్రించడమే కాకుండా మంచి నిద్రకు, ఆకలి పెరగడానికి, జీర్ణక్రియకు తోడ్పడుతుంది.సెరోటోనిన్ పెరగాలంటే ఏమి చేయాలి మరి..? ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు ఎండలో గడపండి (విటమిన్-డి లభిస్తుంది). ధ్యానం (Meditation) చేయడం, వ్యాయామం చేయడం వల్ల సెరోటోనిన్ స్థాయిలు మెరుగుపడతాయి.
3. ఆక్సిటోసిన్ (Oxytocin) 'లవ్' హార్మోన్.. బలమైన బంధాలు, నమ్మకం ఏర్పడటానికి ఈ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సిటోసిన్ పెరగాలంటే ఏమి చేయాలి మరి..?.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మనసు విప్పి మాట్లాడండి. పెంపుడు జంతువులతో గడపడం, ఇతరులకు చిన్న సహాయం చేయడం ద్వారా ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.
4. ఎండార్ఫిన్లు (Endorphins).. 'పెయిన్ కిల్లర్'.. శారీరక నొప్పులను తగ్గించి, మనసుకి హాయినిస్తాయి.ఎండార్ఫిన్లు పెరగాలంటే ఏమి చేయాలి మరి..? బాగా నవ్వడం, డార్క్ చాక్లెట్ తినడం, చెమట పట్టేలా వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి.
ఇవీ కూడా ప్రధానమే..
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్‌లో చేర్చుకోండి. రోజుకు 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర హార్మోన్ల సమతుల్యతకు చాలా అవసరం. పెయింటింగ్, వంట చేయడం లేదా తోటపని వంటి మీకు నచ్చిన పనుల్లో నిమగ్నం అవ్వండి. సంతోషం అనేది మార్కెట్లో దొరికేది కాదు.. మన అలవాట్లు, జీవనశైలి ద్వారా మన శరీరమే ఉత్పత్తి చేసుకునే ఒక అద్భుత రసాయన ప్రక్రియ. కాబట్టి ఆరోగ్యకరమైన అలవాట్లతో హ్యాపీగా ఉండొచ్చు.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
