TB Bacteria Research : టీబీ బ్యాక్టీరియా రహస్యం తెలిసిపోయింది.. సరికొత్త చికిత్సతో చెక్ పెట్టొచ్చంటున్న రీసెర్చర్స్..!

షేర్ చేయండి:
TB Bacteria Research : టీబీ బ్యాక్టీరియా రహస్యం తెలిసిపోయింది.. సరికొత్త చికిత్సతో చెక్ పెట్టొచ్చంటున్న రీసెర్చర్స్..!

సాక్షిలైఫ్ : ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న క్షయ వ్యాధి చికిత్సలో మరో ముందడుగు పడింది. సాధారణంగా టీబీ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మందులను తట్టుకుంటూ ఎలా బతుకుతుందనేది వైద్య లోకానికి పెద్ద సవాలుగా మారింది. అయితే, ఈ బ్యాక్టీరియా తన మనుగడ కోసం అంతర్గతంగా కొన్ని ప్రత్యేక సంకేతాలను (Internal Signalling) వాడుకుంటుందని తాజా పరిశోధనలో తేలింది.

 

ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

 

 ట్యుబర్‌క్యులోసిస్ అనేది కేవలం ఒక వ్యాధి కారకం మాత్రమే కాదు. అది అత్యంత తెలివైన వ్యవస్థ. అది తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా, తనను తాను రక్షించుకునేలా నియంత్రించుకుంటుంది. బ్యాక్టీరియా తన మనుగడకు అవసరమైన సంకేతాలను పంపు కుంటుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ సంకేత వ్యవస్థనే లక్ష్యంగా చేసుకున్నారు. బలహీనపరిచే మార్గం..ఈ అంతర్గత సమాచార వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా బ్యాక్టీరియాను లోపలి నుంచే బలహీనపరచవచ్చు.

ఔషధ నిరోధకతకు చెక్..

ప్రస్తుతం చాలా మందిలో టీబీ మందులు పనిచేయడం లేదు (Drug Resistance). ఈ కొత్త విధానం ద్వారా మందులకు లొంగని బ్యాక్టీరియాను కూడా అదుపు చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు టీబీ రోగుల్లో చికిత్స కాలాన్ని తగ్గించడమే కాకుండా, ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు తోడ్పడతాయి. ముఖ్యంగా మొండి క్షయ (MDR-TB) బారిన పడిన వారికి ఇది ఒక వరంలా మారనుంది. భవిష్యత్తులో ఈ విధానం ద్వారా రూపొందించే ఔషధాలు బ్యాక్టీరియాను మరింత వేగంగా నిర్మూలించగలవు. క్షయ లక్షణాలు.. వారానికి పైగా దగ్గు, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.