Calories : కేలరీలు బర్న్ చేయాలంటే ఏమేం చేయాలి..?  

షేర్ చేయండి:
Calories : కేలరీలు బర్న్ చేయాలంటే ఏమేం చేయాలి..?  

సాక్షి లైఫ్ : పాలతో చేసిన ఒక కప్పు చాయ్‌లో 200 కేలరీలు ఉంటాయి. ఇది ఒక డబ్బా సోడా కంటే ఎక్కువ. సోయా పాలతో చేసిన పానీయం180 కేలరీలు కలిగి ఉంటుంది, అయితే కొవ్వు లేని పాలలో 160 కేలరీలు ఉంటాయి. టీలో అరకప్పు నాన్‌ఫ్యాట్ పాలు, అర టేబుల్‌స్పూన్ తేనె కలిపితే అది 75 కేలరీలకు తగ్గుతుంది. టీ పరిమాణం మారితే, కేలరీలు కూడా మారుతూ ఉంటాయి.100 ml సింగిల్ టోన్డ్ మిల్క్‌లో దాదాపు 58 కేలరీలు ఉంటాయి. ఇలాంటివి తీసుకున్నప్పుడు కేలరీలు బర్న్ చేయాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి.. Hepatitis: కాలేయంలో వాపు హెపటైటిస్‌కు సంకేతమా..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

మనిషి రోజుకు ఎంత తింటే ఎన్ని కేలరీల శక్తి వస్తుంది. శరీర బరువును మేనేజ్ చేయడానికి ఎన్నికేలరీల శక్తి అవసరం ? అందుకోసం ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలి..? మీరు బరువు తగ్గడం లేదా పెరగడంతో సంబంధం లేకుండా మీ రోజువారీ కార్యకలాపాలకు ఎనర్జీటిక్ గా ఉండటానికి ఎన్ని కేలరీలు సరిపోతాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

ఒక టేబుల్ స్పూన్ చక్కెరలో దాదాపు 48 కేలరీలు ఉంటాయి, అయితే ఒక టీస్పూన్ చక్కెరలో 20 కేలరీలు ఉంటాయి.100 ml మొత్తం పాలలో 49% కొవ్వు, 30% పిండి పదార్థాలు, 21% మాంసకృత్తులతో పాటు 62 కేలరీలు ఉంటాయి. మీ క్యాలరీలను తగ్గించుకోడానికి డైటీషన్ లు పలురకాల సూచనలు చేస్తున్నారు, లింగం, వయస్సు, బరువు , ఎత్తు ఆధారంగా రోజువారీ తీసుకునే కేలరీలనులెక్కించాలని వారు సిఫార్సు చేస్తున్నారు.

 మహిళలు రోజుకు1200-2000 కేలరీలు , పురుషులు 1600-2600 కేలరీలు తీసుకోవాలని చెబుతున్నారు. భారతీయులకు సరైన కేలరీల తీసుకోవడం అనేది జీవనశైలితోపాటు ప్రతిరోజూ చేసే ఎక్సర్ సైజ్ పై ఆధారపడి ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలకు ఎనర్జీటిక్ గా ఉండటానికి 2,000 కేలరీలు సరిపోతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అయితే, మీరు ఎన్ని కేలరీలు వినియోగిస్తారనే దాని గురించి మాత్రమే కాదు..ఇది మీరు ఎంచుకున్న ఆహారాల రకాలు, ఆ కేలరీలను బర్న్ చేయడం గురించి మీరు అనుసరించే విధానం కూడా చాలా ఇంపార్టెంటే .. ఫుడ్ ప్లాన్, కేలరీల తీసుకోవడం, బరువు తగ్గడానికి తప్పనిసరిగా ఇవి తెలుసుకోవాలి.

తీసుకునే ఆహారంలో కేలరీలు తక్కువగానూ, పోషకాలు ఎక్కువగానూ ఉండాలి. మీకు అవసరమైన అన్ని పోషకాలను కలిగి ఉన్న పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మీరు తిన్నంత కాలం బరువు తగ్గడమనేది అంత సులువైన పని మాత్రం కాదు. అందుకు ముఖ్యంగా డైట్ ప్లాన్ ఉండాలి, ఎక్కువ పోషకాలున్న సమతుల ఆహరం అవసరం.  

ఇది కూడా చదవండి.. కాలేయ వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి..?

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.