ఛాతీ నొప్పి లేకుండా కూడా గుండెపోటు వస్తుందా..?
సాక్షి లైఫ్ : గుండెపోటు అనగానే మనకు వెంటనే ఛాతీలో తీవ్రమైన నొప్పి, ఎడమ చేయి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు గుర్తుకొస్తాయి. అయితే, కొన్నిసార్లు గుండెపోటు లక్షణాలకు భిన్నంగా ఉంటాయని మీకు తెలుసా? దీనినే అసాధారణ గుండెపోటు (Atypical Heart Attack) అంటారు. సాధారణ లక్షణాలు కనిపించవు, కాబట్టి దీనిని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. అందుకే, టిపికల్ హార్ట్ ఎటాక్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, మధుమేహ సమస్య ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి..మెనోపాజ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?
టిపికల్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి..?
టిపికల్ హార్ట్ ఎటాక్ అంటే గుండె కండరాలలోని ఒక భాగానికి రక్త ప్రవాహం నిలిచిపోయినప్పటికీ, దాని లక్షణాలు సాధారణ గుండెపోటులా ఉండకపోవడం. ఇందులో ఛాతీలో తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు ఉండే నొప్పికి బదులుగా, తేలికపాటి ఒత్తిడి, అసౌకర్యం లేదా అసలు నొప్పి లేకుండా ఉండవచ్చు. దీనిని గుర్తించడం కష్టం కాబట్టి, ఇలాంటి లక్షణాలున్నప్పుడు ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు రోగులతో పాటు డాక్టర్లు కూడా దీనిని ఇతర సమస్యగా భావించవచ్చు.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
