సాక్షి లైఫ్ : డిప్రెషన్ అనేది మీ మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ తీసే ఒక తీవ్రమైన సమస్య. ఇది సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో అనేక విధాలుగా డిప్రెషన్ ను నిర్వహించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు కూడా డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీరు పోషకాహారం, వ్యాయామం సహాయంతో దాని బారీ నుంచి కొంతమేర ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
డిప్రెషన్..
డిప్రెషన్ అనేది ఒక మానసిక సమస్య, దీని వల్ల ప్రస్తుత తరంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. డిప్రెషన్ నిర్ధారించినప్పుడు, ప్రజలు సైకియాట్రిస్ట్ లేదా మానసిక ఆరోగ్య నిపుణులు సహాయంతో దానిని అధిగమించడానికి వివిధ రకాల చికిత్సలను తీసుకుంటారు. డిప్రెషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది కాకుండా, మీరు కొన్ని ఇతర విషయాల సహాయంతో కూడా ఈ సమస్యకు పరిష్కారం పొందవచ్చు.
పోషకాహారం, వ్యాయామం డిప్రెషన్‌కు చికిత్సగా పనిచేసే రెండు ప్రధానమైనవి. మానసిక ఆరోగ్యంతో దీనికి సంబంధం లేదని కొంతమంది భావించినప్పటికీ, మానసిక ఆరోగ్యంలో పోషకాహారం, వ్యాయామం రెండూ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయనేది నిజం. ఎలాగో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి.?
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని పెంచే ఆహారపు అలవాట్లు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఈ పదార్థానిది కీలక పాత్ర..
పోషకాహారం-వ్యాయామం..
ఏదైనా ఒక నిర్దిష్ట ఆహారం తీసుకోవడం ద్వారా డిప్రెషన్‌ను నయం చేయడం సాధ్యం కాదు, కానీ విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు, కాంప్లెక్స్ పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇలాంటి ఆహారం డిప్రెషన్ ను కొంతమేర తగ్గించడానికి సహాయపడుతుంది.
పిండి పదార్థాలు మెదడుకు గ్లూకోజ్, శక్తిని అందిస్తాయి. ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మూడ్‌ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. అయితే, అనారోగ్యకరమైన పిండి పదార్థాలు తినడం మానుకోవడం చాలా ముఖ్యం. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి.
ప్రోటీన్ హార్మోన్ల ఉత్పత్తికి..
ప్రోటీన్లను తయారు చేసే అమైనో ఆమ్లాలు మెదడులో న్యూరోట్రాన్స్మిటర్లను తయారు చేసేందుకు ఉపయోగపడతాయి. ఇవి ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నుంచి తయారవుతుంది. డోపమైన్ అనేది ఫీల్-గుడ్ హార్మోన్, ఇది ఫెనిలాలనైన్ అనే అమైనో ఆమ్లం నుంచి తయారవుతుంది. ఈ విధంగా, ప్రోటీన్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది వ్యక్తికి మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడానికి వీలు కలుగుతుంది.
ఫ్యాటీ యాసిడ్..
ఆరోగ్యకరమైన మెదడు, మెరుగైన మానసిక ఆరోగ్యం కోసం, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం దానిని స్వయంగా ఉత్పత్తి చేయదు. శరీరం దానిని ఆహారం ద్వారా మాత్రమే పొందుతుంది. అందువల్ల ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండే ఆహారం కూడా డిప్రెషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
అదేవిధంగా, వ్యాయామం కూడా డిప్రెషన్‌కు యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. వ్యాయామం మధుమేహం, రక్తపోటు, స్ట్రోక్, గుండెపోటు వంటి అనేక వ్యాధులను నివారించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
మానసిక స్థితి..
వ్యాయామం చేసే సమయంలో ఎండోర్ఫిన్‌లు అనే మంచి అనుభూతిని కలిగించే రసాయనాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. వ్యాయామం చేసిన తర్వాత వచ్చే ఫలితాలు డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. శారీరక ఆరోగ్యం మెరుగుపడటం ద్వారా మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com