వర్షాకాలంలో జాగ్రత్త..! ఫ్లూ టీకా ఎందుకు ముఖ్యమో తెలుసా..?

షేర్ చేయండి:
వర్షాకాలంలో జాగ్రత్త..! ఫ్లూ టీకా ఎందుకు ముఖ్యమో తెలుసా..?

సాక్షి లైఫ్ : వాతావరణ మార్పులు, పెరిగిన తేమ కారణంగా వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో అనూహ్య వర్షపాతం నమోదవ్వడం, ఆ తర్వాత రుతుపవనాల కాలంలో ఎండ, వాన ఆకస్మికంగా మారడం వంటివి ప్రజల రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తున్నాయి.

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

దీని ఫలితంగా, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో సంవత్సరం పొడవునా ఇన్ఫ్లుఎంజా వంటి వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లూను నివారించడానికి వార్షిక టీకా తీసుకోవడం అత్యంత విశ్వసనీయమైన మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 చాలా మంది ఫ్లూను సాధారణ జలుబుగా పొరపడుతుంటారు. అయితే, ఫ్లూ అనేది అధిక జ్వరం, తీవ్రమైన ఒంటి నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో కూడిన తీవ్రమైన వ్యాధని డా.విష్ణున్ రావు తెలిపారు. ఈ వైరస్‌లు ప్రతి ఏటా తమ రూపాన్ని మార్చుకుంటాయి కాబట్టి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) సిఫార్సుల ఆధారంగా ప్రతి సంవత్సరం కొత్త టీకా అందుబాటులోకి వస్తుంది.

అందుకే, కేవలం పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఏడాదికి ఫ్లూ షాట్ అవసరమని డా. జెజో కరంకుమార్ అంటున్నారు. ఫ్లూ టీకా తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గడమే కాకుండా, ఒకవేళ ఫ్లూ సోకినా దాని తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని వారు చెబుతున్నారు.

 ఈ వర్షాకాలంలో ఫ్లూ నుంచి రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం, అలాగే అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండటం ముఖ్యం. అయితే, శాశ్వత రక్షణ కోసం ప్రతి ఏటా ఫ్లూ టీకా తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ముఖ్యంగా వృద్ధులను, చిన్నారులను, ,దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది ఫ్లూ టీకా. అనారోగ్యం వచ్చాక బాధపడే బదులు, ముందుగానే నివారించడం ఉత్తమమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.