సాక్షి లైఫ్ : కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన మైనం లాంటి పదార్ధం. ఇది శరీరంలోని ప్రతి కణం పొరలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. శరీరంలో విటమిన్ డి, హార్మోన్ల ఉత్పత్తితో పాటు, కొవ్వు పదార్ధాలను జీర్ణం చేయడానికి ఇది చాలా ముఖ్యం. గుడ్లు, మాంసం, నెయ్యి, వెన్న మొదలైన ఆహారాలలో కొలెస్ట్రాల్ ఉంటుంది.