Constipation : ఇలా చేస్తే.. మలబద్ధకానికి గుడ్‌బై చెప్పేయవచ్చు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మందిని వేధించే ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీని కారణంగా కడుపు ఉబ్బరం, చిరాకు వంటి ఇబ్బందులు తప్పవు. అయితే, దీనికి ఖరీదైన మందులు అవసరం లేదు. మీ రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యను సులభంగా దూరం చేయవచ్చు. ముఖ్యంగా, మీ డైట్‌లో ఈ ఐదు రకాల ఆహారాలను భాగం చేసుకుంటే, మరుసటి రోజు ఉదయం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ మోషన్ అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

  తీసుకోవాల్సిన ఐదుఅద్భుతమైన ఆహారాలు.. 

నానబెట్టిన ఎండు ద్రాక్ష (Soaked Raisins).. రాత్రిపూట కొద్దిగా ఎండు ద్రాక్షను నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తింటే... మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఇవి సహజసిద్ధమైన మలబద్ధక నివారణిగా పనిచేస్తాయి.

ఆకుకూరలు (Leafy Greens)..తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో పీచుపదార్థం (Fiber)నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి పేగుల కదలికలను పెంచి, మలాన్ని మృదువుగా చేస్తాయి. కివీ పండు (Kiwi Fruit)..ఈ పండులో ఫైబర్‌తో పాటు కొన్ని ప్రత్యేక ఎంజైములు ఉంటాయి. రోజుకు ఒకటి లేదా రెండు కివీ పండ్లు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఓట్స్‌ లేదా బార్లీ (Oats or Barley).. వీటిలో కరిగే ఫైబర్ (Soluble Fiber) పుష్కలంగా ఉంటుంది. అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ తీసుకోవడం వల్ల పేగులు శుభ్రపడతాయి.

బొప్పాయి (Papaya).. బొప్పాయిలో 'పాపైన్' అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉదయం బొప్పాయి తినడం వలన పేగుల్లోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. ఈ ఆహారాలతో పాటు, రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు సరిగా తాగకపోతే, ఫైబర్ మరింత గట్టిపడి సమస్యను పెంచుతుంది. శారీరక శ్రమ,సరైన ఆహార నియమాలతో మలబద్ధకానికి గుడ్‌బై చెప్పవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు..!

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.