సాక్షి లైఫ్ : చాలా మంది ఆహార పదార్థాలు పాడవకుండా ఉండాలని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ, కొన్ని రకాల వండిన లేదా కోసిన ఆహారాలు 24 గంటల కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో ఉంటే, అవి విషపూరితంగా (Toxic) మారే ప్రమాదం ఉందని, తద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉడికించిన గుడ్లు (Boiled Eggs).. ఉడికించిన గుడ్లను 24 గంటల కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో ఉంచితే వాటిలో కూడా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. అలాగే వాటి సహజ రుచి, పోషక విలువలు తగ్గిపోతాయి.
ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
వండిన అన్నం (Cooked Rice): అన్నాన్ని వండిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టడం లేదా ఎక్కువ గంటలు ఉంచడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అన్నంలో బాసిల్లస్ సెరియస్ (Bacillus Cereus) అనే బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. దీనిని మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజనింగ్ కారణంగా.. వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. అందుకోసమే అన్నం వండిన 24 గంటల్లోనే తినేయడం ఉత్తమం.
తరిగిన ఉల్లిపాయలు (Cut Onions)..ఉల్లిపాయలను కోసి ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు, అవి గాలిలోని తేమను, ఇతర ఆహారాల వాసనలను త్వరగా గ్రహిస్తాయి. దీనివల్ల వాటిలో బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కోసిన ఉల్లిపాయలను వెంటనే వాడేయండి.
తరిగిన కూరగాయ ముక్కలు (Cut Vegetables).. ఉదయం వంట త్వరగా అవ్వాలని ముందు రోజు రాత్రే కూరగాయలను తరిగి ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు (Vitamins) నశించిపోవడమే కాక, బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com