సరికొత్త పరిశోధన : తల్లి స్పర్శతో ప్రీ మెచ్యూర్ బేబీస్ మెదడుకు బలం..!

సాక్షి లైఫ్ : తల్లిదండ్రులు ఇచ్చే వెచ్చని స్పర్శ (Skin-to-Skin Contact)  తల్లిదండ్రులు ఇచ్చే వెచ్చని స్పర్శ (Skin-to-Skin Contact) నెలలు నిండక ముందే జన్మించిన శిశువుల మెదడు అభివృద్ధికి (Brain Development) కీలకమని తాజా అధ్యయనం తేల్చింది. 32 వారాల కంటే ముందు జన్మించిన శిశువులకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు 'చర్మం-చర్మం స్పర్శ' (కంగారూ కేర్) అందిస్తే, వారి మెదడులో ముఖ్యమైన భాగాలు బలంగా అభివృద్ధి చెందుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే

ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 

అకాల శిశువులకు(premature babies) 'కంగారూ కేర్' వరం..!

అకాల శిశువులు (premature babies)మెదడు ఎదుగుదలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, తల్లిదండ్రులు ఇచ్చే కేరింగ్ స్పర్శ అనేది కేవలం అనుబంధాన్ని పెంచడమే కాకుండా, శిశువుల మెదడుకు శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

 అధ్యయనంలో బయటపడిన కీలక అంశాలు..  

తెల్ల పదార్థం అభివృద్ధి (White Matter Development)..ఈ అధ్యయనంలో 88 మంది అకాల శిశువులను పరిశీలించారు. తమ తల్లిదండ్రుల నుంచి రోజూ ఎక్కువ సమయం పాటు స్కిన్-టు-స్కిన్ కేర్ (Kangaroo Care) పొందిన పిల్లల్లో మెదడులోని 'తెల్ల పదార్థం' (White Matter) బలంగా అభివృద్ధి చెందినట్లు (MRI)ఎమ్ ఆర్ఐ స్కాన్‌లలో గుర్తించారు.

మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణ.. ఈ తెల్ల పదార్థం అనేది మెదడు కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లా పనిచేస్తుంది. చర్మం-చర్మం స్పర్శ వల్ల సమస్య పరిష్కార సామర్థ్యం, భావోద్వేగ నియంత్రణ (Emotion Regulation), ఒత్తిడిని (Stress) తగ్గించే మెదడు ప్రాంతాలు బలపడినట్లు పరిశోధకులు తెలిపారు.

ఎంత సేపు స్పర్శ అవసరం?..  

 రోజువారీ మొత్తం సమయంతో పాటు, ఒక్కో సెషన్ (Session) ఎక్కువ నిడివి ఉండటం అనేది మెదడు ఎదుగుదలకు మరింత బలాన్ని ఇస్తుందని తేలింది. ఈ అధ్యయనంలో సగటున ఒక సెషన్ 70 నిమిషాలు ఉంది.

సామాజిక అంశాలతో సంబంధం లేదు..  

ఆశ్చర్యకరంగా, శిశువు పుట్టిన వయస్సు (Gestational Age), తల్లిదండ్రుల సామాజిక-ఆర్థిక స్థితి వంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నా కూడా, చర్మం-చర్మం తాకిడి వలన మెదడు అభివృద్ధిపై సానుకూల ప్రభావం స్పష్టంగా కనిపించింది.

పరిశోధకులు ఏమంటున్నారు?

Neonatal intensive care unit (NICU)లో ఇంక్యుబేటర్లు, మందులు మాత్రమే కాకుండా, తల్లిదండ్రులు కూడా మెదడు అభివృద్ధికి శక్తివంతమైన ఔషధం లాంటివారని ఈ అధ్యయనం నిరూపిస్తుంది" అని అధ్యయన రచయిత డా. కేథరిన్ ట్రావిస్ పేర్కొన్నారు.

తల్లిదండ్రులకు.. 

అకాలంగా పుట్టిన పిల్లల సంరక్షణలో తల్లిదండ్రులు క్రియాశీల భాగస్వాములుగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, మీ స్పర్శ కేవలం అనుబంధాన్ని పెంచడమే కాదు... మీ బిడ్డ మెదడులో కొత్త కనెక్షన్లను, బలాన్ని కూడా ఇస్తుంది. ఇది వారి భవిష్యత్తు ఆరోగ్యాన్ని, ప్రవర్తనా ఫలితాలను మెరుగుపరుస్తుంది. ప్రతి తల్లి,దండ్రి తమ శిశువుకు వీలైనంత ఎక్కువగా 'కంగారూ కేర్' అందించాలని వైద్యులు ప్రోత్సహిస్తున్నారు.ఈ అధ్యయనం వివరాలు ప్రముఖ వైద్య పత్రిక 'న్యూరాలజీ' (Neurology) లో ప్రచురించారు.

 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : newborn-babies new-born-babies emotions skin-health babies skin emotional-impact brain-function skin-protection newborn-baby emotion-regulation session premature-babies kangaroo-care kangaroo-care-for-premature-babies premature-baby-brains
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com