Gen Z sensation : మద్యాన్ని దూరం పెడుతున్న జెన్-జడ్ యువత..! కారణమిదే..

సాక్షి లైఫ్ : గత తరాలతో పోలిస్తే, ప్రస్తుత యువతరం - అంటే (Gen Z) జెన్-జడ్ 1997-2012 మధ్య జన్మించిన యువత మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించింది. ఈ విషయాన్ని సర్వేలు, అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు, మానసిక ప్రశాంతతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్న ఈ తరం యువత... మత్తు పానీయాల కంటే నాన్-ఆల్కహాలిక్ (Non-Alcoholic) లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న డ్రింక్స్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. భారతదేశంలో ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఎందుకు ఈ మార్పు.. అంటే..? 

జెన్-జడ్ (1997-2012 మధ్య జన్మించినవారు) మద్యం తగ్గించడానికి లేదా పూర్తిగా మానేయడానికి ప్రధానంగా చెబుతున్న కారణాలు ఇవే:

పెరిగిన ఆరోగ్య స్పృహ.. 

మద్యం ఆరోగ్యానికి హానికరం అనే స్పృహ ఈ యువతలో బలంగా ఉంది. బరువు పెరగడం, చర్మం దెబ్బతినడం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలపై వీరు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. WHO కూడా 'ఎంత తక్కువ తాగినా ఆరోగ్యానికి మంచిది కాదు' అని చెప్పడం ఈ ఆలోచనకు బలం చేకూర్చింది.

మానసిక ఆరోగ్యం.. ఆందోళన (Anxiety), ఒత్తిడిని (Stress) తగ్గించు కోవడానికి మద్యం తాగుతారు అనే పాత ఆలోచనకు ఈ తరం స్వస్తి చెప్పింది. మద్యం డిప్రెసెంట్ (Depressant) అని, మానసిక సమస్యలకు అస్సలు పరిష్కారం కాదని వీరు గ్రహించారు. యోగా, వ్యాయామం, థెరపీ వంటి ఆరోగ్యకరమైన మార్గాలపై దృష్టి సారిస్తున్నారు.

సోషల్ మీడియా ఇమేజ్.. సోషల్ మీడియాలో తమ ఇమేజ్‌ను, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని Gen Z ఎక్కువగా కోరుకుంటున్నారు. తాగి పడిపోవడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు.

మద్యం మానేస్తే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!

యువతరం ఈ ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకోవడం వలన వారికి దీర్ఘకాలంలో లభించే అద్భుత ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. మెరుగైన నిద్ర (Improved Sleep).. మద్యం తాగడం మానేస్తే, నిద్ర నాణ్యత బాగా పెరుగుతుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. బరువు తగ్గుతారు (Weight Loss).. మద్యం, కాక్‌టెయిల్స్‌లో కేలరీలు (Calories) ఎక్కువగా ఉంటాయి. వాటిని మానేయడం ద్వారా బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది.కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది (Healthy Liver).. కాలేయంపై పని భారం తగ్గుతుంది. ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు.

గుండె ఆరోగ్యం పదిలం (Cardio-Vascular Health).. రక్తపోటు (Blood Pressure) అదుపులో ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.మానసిక స్పష్టత (Mental Clarity).. జ్ఞాపకశక్తి (Memory)ఏకాగ్రత (Concentration) మెరుగుపడతాయి. మానసిక ఆందోళనలు, ఒత్తిడి వంటివి తగ్గుముఖం పడతాయి.శక్తి పెరుగుదల (Increased Energy)..శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి, ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు.

 Gen Z తీసుకుంటున్న ఈ 'నో-ఆల్కహాల్' నిర్ణయం ఒక తాత్కాలిక ట్రెండ్ కాదని, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు తీసుకువెళ్లే ఒక గొప్ప మార్పు అని నిపుణులు చెబుతున్నారు. యువతరం ఈ స్ఫూర్తిని కొనసాగిస్తే, భవిష్యత్తులో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ ఉన్న తరాన్ని మనం చూడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, కొందరు యువత మద్యానికి బదులుగా గంజాయి (Cannabis) వంటి ఇతర పదార్థాలకు అలవాటు పడుతున్నారని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి, యువత కేవలం మత్తుకు దూరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంచుకోవడం ముఖ్యమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : mental-tensions stress anxiety-effect heart-problems-cardiologist eating-habits healthy-habits hypertrophic-cardiomyopathy alcohol anxiety drinking food-habits good-habits bad-habits depression-and-anxiety cardiovascular-health cardiology burning-sensation generation-z cardiovascular-exercise genetics
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com