Amazing Health Benefits : రాత్రి తిన్న వెంటనే ఇలా చేస్తే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే కేవలం పౌష్టికాహారం తీసుకోవడమే కాదు, మనం ఆ ఆహారాన్ని ఏ సమయానికి తీసుకుంటున్నాం, తిన్న తర్వాత ఏం చేస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రి భోజనం విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు దీర్ఘకాలంలో పెద్ద అనారోగ్యాలకు దారితీస్తాయి. చాలామంది రాత్రి తిన్న వెంటనే మొబైల్ చూస్తూ మంచంపై వాలిపోతుంటారు లేదా టీవీ ముందు కూర్చుంటారు. కానీ, భోజనం తర్వాత 15 నుంచి 20 నిమిషాలు నడిచే అలవాటు చేసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Knee Pain : నడిచినా నొప్పి.. కూర్చున్నా నొప్పి..? మోకాళ్లలో 'టక్ టక్' శబ్దం వస్తుందా..? ఇదిగో పరిష్కారం.. 

ఇది కూడా చదవండి..Irritable Bowel Syndrome : ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (IBS) అంటే ఏమిటి..? లక్షణాలెలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

ఈ చిన్న మార్పు ఊబకాయం, మధుమేహం వంటి లైఫ్‌స్టైల్ వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాత్రి భోజనం తర్వాత నడక వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రి పూట నడక.. ఎందుకంత కీలకం..?

మనం ఆహారం తీసుకున్న తర్వాత, దాన్ని జీర్ణం చేసి, పోషకాలను గ్రహించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే పనిలో శరీరం నిమగ్నమవుతుంది. సరిగ్గా ఈ సమయంలో మనం ఎటువంటి కదలికా లేకుండా పడుకోవడం లేదా కూర్చోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల పొట్ట ఉబ్బరం, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే తిన్న తర్వాత కాసేపు నెమ్మదిగా నడిస్తే కండరాలు చురుగ్గా మారి రక్తంలోని గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

భోజనం తర్వాత నడిస్తే కలిగే లాభాలు..

రాత్రి భోజనం తర్వాత నెమ్మదిగా నడవడం వల్ల పొట్ట, పేగుల్లో కదలికలు (Bowel Movements) చురుకవుతాయి. ఆహారం జీర్ణవ్యవస్థ గుండా సాఫీగా కదులుతుంది. దీనివల్ల రాత్రిపూట తరచుగా వేధించే గ్యాస్, కడుపు ఉబ్బరం, పుల్లటి త్రేన్పులు వంటి అజీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

 మనం తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి (Spike). ఈ సమయంలో 15 నిమిషాల పాటు నడిస్తే, మన కండరాలు శక్తి కోసం ఆ గ్లూకోజ్‌ను ఉపయోగిస్తాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం (Type 2 Diabetes) ఉన్నవారికి, ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నవారికి ఈ అలవాటు అమృతం లాంటిది.

 రాత్రి తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల శరీరం క్యాలరీలను ఖర్చు చేయదు, ఫలితంగా ఆ గ్లూకోజ్ అంతా కొవ్వుగా మారుతుంది. అదే కాసేపు నడిస్తే జీవక్రియ వేగవంతమై, అదనపు క్యాలరీలు కరిగి పోతాయి. సరైన ఆహారంతో పాటు ఈ చిన్న అలవాటును జోడిస్తే ఊబకాయాన్ని దూరంగా ఉంచవచ్చు.

యాసిడ్ రిఫ్లక్స్ నివారణ..

 తిన్న వెంటనే పడుకోవడం వల్ల పొట్టలోని ఆమ్లాలు వెనక్కి అన్నవాహికలోకి వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల ఛాతీలో మంట, అసౌకర్యం కలుగుతాయి. నడక వల్ల ఆహారం త్వరగా కిందికి వెళ్లిపోయి గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.

భోజనం తర్వాత నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచి, గుండెపై భారాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుముఖం పడుతుంది. భోజనం తర్వాత నడక అనగానే కష్టపడి జాగింగ్ చేయడం లేదా వేగంగా నడవడం కాదు. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు నెమ్మదిగా, ఆహ్లాదకరంగా సాగే 'బ్రిస్క్ వాక్' లేదా తేలికపాటి నడకను మాత్రమే ఎంచుకోవాలి.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.