డ్యాన్స్ తో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : డ్యాన్స్ అనేది శారీరక , మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కళ. డ్యాన్స్ ను అందరూ ఇష్టపడుతుంటారు. కొందరికి దీన్ని హాబీగా చేయడం ఇష్టం అయితే, మరికొంత మంది వర్కవుట్‌గా చేయడం ఇష్టం. డ్యాన్స్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా, ఈ రోజుల్లో చాలా మంది దానిని కెరీర్‌గా స్వీకరిస్తున్నారు. అయితే హాబీగా చేసే డ్యాన్స్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా..? ఈరోజు ఇంటర్నేషనల్ డ్యాన్స్  డే  సందర్బంగా డ్యాన్స్ చేయడం వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 ఇది కూడా చదవండి.. వేసవిలో కళ్లు ఎర్రబడుతున్నాయా..? ఇవిగో చిట్కాలు..  


గుండె ఆరోగ్యం.. 

రోజూ డ్యాన్స్ చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. క్రమం తప్పకుండా డ్యాన్స్ చేస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం ధృడంగా ఉంటుంది. సమతుల్యత , సమన్వయాన్ని నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. నృత్యం అనేది ఒక రకమైన పూర్తి శరీర వ్యాయామం. ఇది శారీరకంగా మాత్రమే కాకుండా మానసిక వికాసాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

డిప్రెషన్ నుంచి ఉపశమనం.. 

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, పనిభారం వల్ల అనేక రకాల మానసిక సమస్యలకు గురవుతున్నారు. కాబట్టి ఈ మానసిక సమస్యల నుంచి బయటపడడానికి డ్యాన్స్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడానికి డ్యాన్స్ చాలా బాగా ఉపకరిస్తుంది.

నిద్రలేమికి సరైన పరిష్కారం..  

నిద్రలేమి కారణంగా తరచుగా ఇబ్బంది పడేవారికి డ్యాన్స్ ఎంతో మేలుచేస్తుంది. క్రమం తప్పకుండా డ్యాన్స్ చేయడం వల్ల శరీరానికి మంచి వర్కవుట్ చేసినట్లు అవుతుంది. దీని వల్ల అలసిపోయి ఆ అలసట వల్ల మంచి నిద్ర వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో డ్యాన్స్ చేయడం ద్వారా నిద్రలేమి సమస్యను కూడా వదిలించుకోవచ్చు.

బరువు.. 

ఈ రోజుల్లో సరైన జీవనశైలి లేని కారణంగా చాలా మంది ఊబకాయానికి గురవుతున్నారు. అయితే బరువును తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. డ్యాన్స్ అనేది ఒక రకమైన వ్యాయామం,   డ్యాన్స్ చేయడం ద్వారా కేలరీలను వేగంగా తగ్గించుకోవచ్చు. దీని వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

 చురుగ్గా..  

 త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తే డ్యాన్స్ చేయడం ద్వారా చాలా చురుగ్గా ఉండవచ్చు. డ్యాన్స్ మనిషి స్టామినాను పెంచడంలో సహాయపడటమే కాకుండా, కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం కూడా అందిస్తుంది. ఇది కాకుండా, ప్రతిరోజూ డ్యాన్స్ చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.

 ఇది కూడా చదవండి.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.