Salt effects : ఉప్పు వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుందా..?

సాక్షి లైఫ్: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే చక్కెర, ఉప్పు రెండింటినీ తగ్గించాలని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.ఉప్పు అధికంగా తీసుకోవడం అనేక విధాలుగా ఆరోగ్యానికి హాని జరుగుతుంది. దీని కారణంగా, రక్తపోటు పెరగడంతోపాటు గుండెకు హాని కలుగుతుంది. అంతేకాదు ఎముకలకు కూడా హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

 

శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి, ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ,పోషక పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అనేక రకాల సీజనల్ పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పలు వ్యాధుల నుంచి రక్షించడంలో ఉపయోగపడుతుంది. అయితే మనం రోజూ ఏమి తినాలి అనే దానికంటే, ప్రస్తుత సమయంలో ఏయే వాటికి దూరంగా ఉండాలో కూడా తెలుసుకోవడం ముఖ్యమని వైద్యనిపుణులు అంటున్నారు.

ఉప్పు వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుందా..?

ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడానికి అత్యంత అవసరమైన పోషకాలలో కాల్షియం ఒకటి. ఎక్కువగా ఉప్పు తీసుకుంటే, అది శరీరంలో కాల్షియం లోపానికి కారణమవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎంత ఎక్కువ ఉప్పు తింటే, మీ శరీరం నుంచి అంత  ఎక్కువ కాల్షియం పోతుందట, అంటే ఇది మీ ఎముకలకు కూడా చాలా హానికరం.

రక్తప్రవాహంలో సోడియం స్థాయులు పెరగడం మూత్రపిండాల పనిసామర్థ్యాన్ని తగ్గిస్తాయి. మూత్రపిండాలు శరీర వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయన్నది తెలిసిందే.  మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాస్తా రక్తపోటు చివరికి హార్ట్ స్ట్రోక్ ,హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.  

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..? 

ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా హాని కలుగుతుంది. ఇది కండరాలు, ఎముకలతోపాటు అనేక ఇతర అవయవాలపై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది.

గుండె కండరాల సమస్య
తలనొప్పి
మూత్రపిండ వ్యాధి 
బోలు ఎముకల వ్యాధి
అధిక రక్త పోటు
మూత్రపిండాల్లో రాళ్లు. వంటి అనారోగ్య సమస్యలు ఉప్పు ఎక్కువగా తినడంవల్ల తలెత్తవచ్చని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : difference-rock-salt black-salt vegan salt salt-side-effects epsom-salt salty-foods low-salt-diet
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com