నైట్ షిఫ్టుల్లో పనిచేయడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..?  

సాక్షి లైఫ్ : ఎక్కువగా నైట్ షిఫ్టుల్లో పనిచేయడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని అనేక పరిశోధనలు సైతం నిరూపించాయి. రాత్రి పగలు పని చేయడం వల్ల శరీరంలో సిర్కాడియన్ రిథమ్ (circadian rhythm) లో మార్పులు వస్తాయి. ఇది హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

 

అసంతృప్తిగా ఉండడం వల్ల కూడా ఆందోళన, స్ట్రెస్ వంటివి పెరుగుతాయా..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

పురుషులలో టెస్టోస్టిరోన్ హార్మోన్ రాత్రి సమయంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు ముఖ్యమైనది. అయితే, రాత్రిళ్లు పనిచేయడం, ఎక్కువ గంటలు నిద్రలేకపోవడం, ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ ఈ ప్రక్రియను అడ్డుకునే అవకాశం ఉంది.

ఈ విధమైన జీవనశైలి పరిణామాలు, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత వల్ల పురుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.ఈ సమస్యను నివారించడానికి, సరిపడా నిద్ర, శారీరక వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించే మార్గాలు పాటించడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

 నిరంతరం రాత్రి షిఫ్టులలో పనిచేయడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అలాగే, వాటి నాణ్యత కూడా ప్రభావితం కావచ్చు, ఇది వంధ్యత్వానికి కారణమవుతుంది. రాత్రిపూట ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు నిరంతరం తగ్గుతాయి. టెస్టోస్టెరాన్ స్థాయిలు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం.

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health depression late-night night-food sedentary-lifestyle obesity-problems obesity healthy-lifestyle office-work sleep-quality night-time sleeping-position sleep sleeping sperm-count healthy-sleep poor-lifestyle obesity-research childhood-obesity night-shifts shift-work world-obesity-day world-obesity-day-2025- world-obesity-day-2025 world-obesity-day-2025-theme obesity-day-2025-theme obesity-day-2025
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com