Home Remedies for Acidity: అసిడిటీకి సరైన ఇంటి చిట్కాలు ఇవిగో..
సాక్షి లైఫ్ : కొందరికి ఉదయం పూట కూడా అసిడిటీ సమస్య తలెత్తుతుంది. ఐతే దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఒకోసారి ఒత్తిడి కారణంగా కూడా అసిడిటీ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. రోజూ సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తరచుగా అసిడిటీ వస్తుంది. కడుపులోని ఆమ్లాలు ఆహార పైపు ద్వారా పైకి వచ్చినప్పుడు, ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. పొద్దున్నేఅసిడిటీ గా అనిపిస్తే ఉపశమనం కోసం ఏమి చేయాలి..? అసిడిటీ కారణంగా, పొడి దగ్గు, వికారం, ఛాతీలో లేదంటే, కడుపులో నొప్పి గా కానీ అసౌకర్యంగా కానీ అనిపిస్తుంది.
ఇది కూడా చదవండి.. బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇవి మీకోసమే..
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
గర్భిణీ స్త్రీలకు కూడా ఉదయం పూట హార్మోన్ల మార్పుల వల్ల అసిడిటీ వస్తుంది. రాత్రి భోజనం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల అసిడిటీ రావచ్చు. రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అసిడిటీ వస్తుంది. రాత్రి పూట ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఉదయం పూట కూడా అసిడిటీ రావచ్చు. అసిడిటీతో ఇబ్బంది పడుతుంటే, మీరు కొన్ని హోమ్ రెమిడీస్ పాటించడం ద్వారా ఆ సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చు.
తులసి..
అసిడిటీ ఉన్నవారు తులసి ఆకులను నమిలి తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. తులసి కషాయాన్ని తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. తులసి ఆకులతో పాటు లవంగాలు, కొత్తిమీరని గ్రైండ్ చేసి.. ఆ మిశ్రమాన్ని వేడి నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిలో ఒక టీస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేసిన కషాయాన్ని రోజుకి ఒక కప్పు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
సోపు..
అసిడిటీ విషయంలో 2 నుంచి 4 గ్రాముల సోపు తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే హోటళ్లలో లేదా రెస్టారెంట్లలో భోజనం తర్వాత సోపు ఇస్తారు. సోపుతో ఆహారం బాగా జీర్ణమవుతుంది. అంతేకాదు గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు రావు. ఉదయం నిద్రలేచిన తర్వాత పరగడుపుతో సోపు నీరు తీసుకుంటే చాలా మంచిది. సోపును నీటితో మరిగించి, ఆపై నీటిని వడపోసి తాగాలి. ఉదయాన్నే సోపు నీళ్లు తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు.
జీలకర్ర..
ఉదయం పూట అసిడిటీగా అనిపిస్తే జీలకర్ర నీరు తాగాలి. 2 గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి మరిగించాలి. ఆ తర్వాత జీలకర్ర సారం నీళ్లలో కలిపి వడగట్టి తాగాలి. జీలకర్ర జీర్ణవ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
అల్లం..
అసిడిటీకి చికిత్స చేయడానికి అల్లం నీరు తాగాలి. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అల్లం నీరు తాగడం వల్ల అజీర్ణం, వాంతులు, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ ఉన్నట్లయితే రెండు గ్లాసుల నీరు మరిగించి ఒక గ్లాసు అయ్యేంత వరకు మరిగించాలి. ఆ నీటిలో అల్లం ముక్కలను వేసి మరిగించాలి. ఆ నీటిని వడపోసి తాగాలి.
గ్యాస్, అసిడిటీ , కడుపు నొప్పి మొదలైన జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది జీలకర్ర. అసిడిటీ విషయంలో జీలకర్ర, ఉప్పు కలిపి గోరువెచ్చని నీటితో తాగాలి.
శొంఠి, జాజికాయ..
అసిడిటీ విషయంలో జాజికాయ, శొంఠి పొడి చాలా బాగా పనిచేస్తుంది. జాజికాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. శొంఠి పొడి, జాజికాయ తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, వాంతులు, వికారం, పుల్లని త్రేన్పు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జాజికాయ, శొంఠి పొడి , జీలకర్ర పొడి కలిపి గోరువెచ్చని నీటితో తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
