Dry Throat and mouth : ఎన్ని నీళ్లు తాగినా గొంతు ఎండిపోతోందా..? కారణాలివే.!
సాక్షి లైఫ్ : ప్రతి జీవికి ఆహారం కంటే ముందు తాగే నీరు ఏంతో ప్రధానమైనది. మనిషైనా, జంతువైనా, పక్షి అయినా సరే.. నీరు చాలా అవసరం. దప్పిక వేసినప్పుడు నీళ్లు తాగడం సహజం. కానీ, ఎన్ని నీళ్లు తాగినా కూడా పదే పదే గొంతు, నోరు ఎండిపోతున్నాయా..? అయితే దీన్ని కేవలం సాధారణ దాహం అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. వాతావరణ మార్పులు, మన అలవాట్లతో పాటు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు.
ముఖ్యంగా నోట్లో లాలాజలం (Saliva) తగినంత ఉత్పత్తి కానప్పుడు ఈ సమస్య వస్తుంది. ఆహారం నమలడానికి, మింగడానికి లాలాజలం ఎంతో అవసరం. అయితే, నీళ్లు బాగా తాగుతున్నా గొంతు పొడిబారడానికి ప్రధానంగా ఆరు కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
నోటితో గాలి పీల్చడం..
రాత్రి పడుకున్నప్పుడు జలుబు లేదా ముక్కు దిబ్బడ వల్ల చాలామంది నోటితో గాలి పీల్చుకుంటూ ఉంటారు. గురక సమస్య ఉన్నవారిలో కూడా ఇది కనిపిస్తుంది. ఇలా రాత్రంతా నోరు తెరిచి ఉంచడం వల్ల ఉదయం లేచేసరికి గొంతు పూర్తిగా ఎండిపోయినట్లు అనిపిస్తుంది.
లాలాజలం ఉత్పత్తి తగ్గడం..
నోరు, గొంతు తడిగా ఉండాలంటే లాలాజలం చాలా అవసరం. వయసు పైబడటం వల్ల గానీ, లాలాజల గ్రంథుల సమస్యల వల్ల గానీ దీని ఉత్పత్తి తగ్గినప్పుడు ఎన్ని నీళ్లు తాగినా పొడిబారినట్లే ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో 'జిరోస్టోమియా (Xerostomia)' అంటారు.
మందుల దుష్ప్రభావం..
అలర్జీలు, డిప్రెషన్ (depression), పెయిన్ కిల్లర్స్, బీపీ కోసం వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా గొంతు ఎండిపోవడం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్‌గా కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా మందులు వాడటం మొదలుపెట్టిన తర్వాత ఈ సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మధుమేహం (Diabetes) ముప్పు..
గొంతు ఎండిపోవడంతో పాటు పదేపదే విపరీతమైన దాహం వేయడం, తరచుగా మూత్ర విసర్జన జరగడం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయనడానికి ముఖ్య సంకేతం. ఇలాంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.
టీ, కాఫీలు అతిగా తాగడం..
రోజులో మోతాదుకు మించి టీ, కాఫీలు లేదా కెఫిన్ ఉండే పానీయాలు తాగేవారిలోనూ గొంతు ఎండిపోతుంది. అలాగే మద్యం, ధూమపానం, గుట్కా నమిలే అలవాట్లు కూడా నోటిని పొడిబారేలా చేస్తాయి.
ఒత్తిడి, ఇతర సమస్యలు..
తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన (stress or anxiety) వల్ల కూడా నోరు పొడిబారుతుంది. అలాగే శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ లక్షణం కనిపిస్తుంది.
నివారణ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఒకేసారి కాకుండా రోజంతా కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండాలి. టీ, కాఫీలు, ఆల్కహాల్ వాడకాన్ని బాగా తగ్గించాలి. ధూమపానం మానేయాలి. ముక్కు దిబ్బడ ఉంటే వెంటనే ఆవిరి పట్టడం లేదా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. షుగర్-ఫ్రీ చూయింగ్ గమ్ నమలడం వల్ల లాలాజల గ్రంథులు ఉత్తేజితమై లాలాజలం ఊరుతుంది. ఉదయం, రాత్రి తప్పనిసరిగా బ్రష్ చేస్తూ నోటి శుభ్రతను కాపాడుకోవాలి. రోజులు తరబడి గొంతు ఎండిపోతున్నా, ఆహారం లేదా కనీసం లాలాజలం మింగడానికి కష్టంగా ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా ముఖ్యం.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
