ఎముక క్యాన్సర్ విషయంలో కనిపించే ఐదు లక్షణాలు..   

షేర్ చేయండి:
ఎముక క్యాన్సర్ విషయంలో కనిపించే ఐదు లక్షణాలు..   

సాక్షి లైఫ్ : శరీరాన్ని నిలబెట్టే ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మనం హెల్తీగా ఉండొచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎముక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా కోలుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఎముక క్యాన్సర్‌ను తరచుగా సాధారణ నొప్పులుగా భావించడం వల్ల ఆలస్యంగా గుర్తించే అవకాశాలున్నాయి. అందుకే, కింది ఐదు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..గబ్బిలాల్లో 20 కొత్త వైరస్ లను గుర్తించిన శాస్త్రవేత్తలు.. 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

లక్షణాలు విస్మరిస్తే ప్రాణాంతకం..!

క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికైనా సోకినట్లే, ఎముకలకూ సోకే ప్రమాదం ఉంది. అలా ఎముకలకు కూడా సోకితే దీనిని 'ఎముక క్యాన్సర్' అంటారు. ఇది ఏదైనా ఎముకను ప్రభావితం చేయగలదు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఆపరేషన్ వంటి చికిత్సలతో దీనిని నయం చేయవచ్చు. అయితే, కీలకమైన అంశం ఏమిటంటే, ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని సరిగా అర్థం చేసుకోకపోతే అది ప్రాణాంతకమవుతుంది.

ఎముక క్యాన్సర్ ప్రధాన లక్షణాలు ఇవే.. 

- ఎముకలలో నిరంతర నొప్పి: చాలామంది ఎముకల నొప్పిని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, నొప్పి దీర్ఘకాలం కొనసాగితే అది ఎముక క్యాన్సర్ తొలి సంకేతం కావచ్చు. ఇలాంటి నొప్పిని వెంటనే వైద్యుడికి చూపించాలి.

- ఎముకలలో వాపు : శరీరంలోని ఏదైనా ఎముక చుట్టూ వాపు లేదా గడ్డ లాంటిది అనిపిస్తే అది ఎముక క్యాన్సర్‌కు సూచన కావచ్చు. క్యాన్సర్ కణాలు పెరిగే ప్రాంతంలో ఈ వాపు వస్తుంది, ఇది తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది.

-ఎముకల పైన చర్మం ఎర్రబడటం: ఎముక క్యాన్సర్ సోకినప్పుడు, ప్రభావిత ఎముక పైన ఉన్న కండరాలపై ఎరుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. దీనిని అస్సలు విస్మరించకూడదు.

-ఎముకల నుంచి శబ్దం: క్యాన్సర్ కారణంగా ఎముకలు బలహీనపడతాయి. దీనివల్ల కీళ్ళు, ముఖ్యంగా చీలమండ, మోకాలి, తుంటి, మోచేతి ఎముకల నుంచి వింత శబ్దాలు రావడం మొదలవుతుంది. తరచుగా బలహీనంగా అనిపిస్తుంది.

-ఎముకలలో దృఢత్వం: సాధారణంగా ఎముకలలో దృఢత్వాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే, ఇది కూడా ఎముక క్యాన్సర్ సంకేతం కావచ్చు. చికిత్స తీసుకోకపోతే, నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన నిర్ధారణ పరీక్షలు, చికిత్స తీసుకోవడం మంచిది. ఎముకల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.

ఇది కూడా చదవండి..ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.