చర్మానికి కొల్లాజెన్ ఎలా ఉపయోగపడుతుంది..?
సాక్షి లైఫ్ : వయసు పెరిగే కొద్దీ శరీరంలో పలురకాల మినరల్స్, విటమిన్స్ తగ్గుతాయి. అటువంటి వాటిలో కొల్లాజెన్ చాలా అవసరం. కొల్లాజెన్ అనే ప్రోటీన్ శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది..? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ అనే ప్రోటీన్ చాలా ముఖ్యం. శరీరం స్వయంగా కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, దాని ఉత్పత్తి వయస్సు పెరిగే కొద్దీ తగ్గడం ప్రారంభమవుతుంది. కొల్లాజెన్ లోపం వల్ల కీళ్ల నొప్పులు, చర్మం ముడతలు పడడం జరుగుతుంది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
స్కిన్ అండ్ హెయిర్..
వయస్సు పెరిగేటప్పుడు శరీరంలో కొల్లాజెన్‌ను తగ్గకుండా చూసుకోవాలి.శరీరంలో కొల్లాజెన్ స్థాయి తగ్గినప్పుడు చర్మం ముడతలు పడడం, మొటిమలు రావడం, ఎముకలు కూడా బలహీనపడటం మొదలవుతుంది. శరీరంలో కొల్లాజెన్ లోపం కారణంగా చర్మం, జుట్టుతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
కండరాలు, కీళ్ళు..
కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది కండరాలు, కీళ్ళు, చర్మం, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది. మన శరీరం దానిని సహజంగా ఉత్పత్తి చేస్తుంది. కానీ వయస్సు పెరుగుతున్నకొద్దీ ఈ ప్రక్రియ మందగిస్తుంది. కొల్లాజెన్ లోపిస్తే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ప్రతి ఒక్కరికి 30 ఏళ్ల తర్వాత ఇది చాలా ముఖ్యమని చెబుతున్నారు వైద్యనిపుణులు.
ఎముకల దృఢత్వం..
వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో గట్టితనం తగ్గడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో కీళ్లలో నొప్పిగా అనిపిస్తుంది. దీనికి కొల్లాజెన్ లోపించడమే ఇందుకు కారణం కావచ్చు. శరీరంలో దీని లోపం వల్ల కీళ్లనొప్పులు, వాపు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
జీర్ణవ్యవస్థకు..
శరీరంలో కొల్లాజెన్ లోపం ఉంటే, దాని ప్రభావం జీర్ణవ్యవస్థపై కూడా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో కడుపులో మంట, సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 30 సంవత్సరాల వయస్సు తర్వాత దానికి సంబంధించిన సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
దృఢమైన కండరాలు..
కండరాలను దృఢంగా మార్చడంలో కూడా కొల్లాజెన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సులో పనిచేసే వ్యక్తులు, శరీరంలోని శక్తి స్థాయిని నిర్వహించడానికి కొల్లాజెన్ చాలా అవసరం. కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకునే వ్యక్తులకు అదనపు కొవ్వు సమస్య ఉండదు. అంతేకాదు కండరాలు కూడా దృఢంగా ఉంటాయి.
చర్మం- జుట్టుకు అవసరం
శరీరంలో కొల్లాజెన్ సరైన మొత్తంలో ఉన్నప్పుడు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలనుకుంటే, మీ వయస్సు పెరిగే కొద్దీ కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం చాలా అవసరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తద్వారా ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించవచ్చు. అటువంటి పరిస్థితిలో జుట్టు రాలే సమస్య ఉండదు. అంతేకాదు జుట్టు మందంగా, బలంగా మారుతుంది. కొల్లాజెన్ కు సంబంధించిన సప్లిమెంట్లు చర్మం పొడిబారడాన్ని తొలగించడంతోపాటు, సహజమైన మెరుపును తీసుకురావడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
