Hangover : హ్యాంగోవర్ ఉంటే పారాసిటమాల్ వేసుకోకూడదా..?
సాక్షి లైఫ్ : ఏ నొప్పి వచ్చినా సహజంగా చాలామంది పారాసిటమాల్ వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మద్యం తాగినప్పుడు హ్యాంగోవర్ సమయంలో పారాసిటమాల్ ఎందుకువేసుకోకూడదు..? ఒకవేళ వేసుకుంటే ఏమవుతుంది..? అనేదానిపై డాక్టర్లు ఏమంటున్నారు..? పిల్లలకు వేసేటపుడు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. సమస్య వచ్చిన ప్రతిసారి పారాసెటమాల్ ఇష్టారీతిన తీసుకోవడం మంచిది కాదు. అవసరం మేరకే, తక్కువ మోతాదు నుంచి తీసుకోవాలి.
ఒక రోజులో రెండుగ్రాములకు మించి..
పెద్దలకైతే ఒక మోతాదుకు ఒక గ్రాము తీసుకోవాలట. అలా ఒక రోజులో 4 గ్రాములకు మించి తీసుకోకూడదు. ఒకవేళ వారికి ప్రతిరోజూ మద్యం సేవించే అలవాటు ఉండి ఉంటే ఇందులో సగం వంతు అంటే ఒక రోజులో రెండుగ్రాములకు మించి పారాసెటమాల్ తీసుకోకుడదని వైద్య నిపుణులువెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఆల్కహాల్ సేవించినపుడు మాత్రం..
పారాసెటమాల్ ఎలా తీసుకున్నా దాదాపు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆల్కహాల్ సేవించినపుడు మాత్రం పారాసెటమాల్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆల్కహాల్‌లో ఇథనాల్ ఉంటుంది.ఈ ఇథనాల్ సమ్మేళనం పారాసెటమాల్‌తో ప్రతిచర్య జరుపుతుంది. దీని కారణంగా వికారం, వాంతులు, తలనొప్పి, మూర్ఛ, అయోమయం వంటి సమస్యలు తలెత్తుతాయి.
రాత్రిపూట అతిగా మద్యం సేవించడంవల్ల కలిగే హ్యాంగోవర్‌ను వదిలించు కోవడం కోసం పారాసెటమాల్ అస్సలు తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక వల్ల కాలేయం విషపూరితంగా మారి ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
