హెల్త్ కేర్ : ఆరోగ్యకరమైన ఐదు అలవాట్లు..  

షేర్ చేయండి:
హెల్త్ కేర్ : ఆరోగ్యకరమైన ఐదు అలవాట్లు..  

సాక్షి లైఫ్ : ప్రస్తుత జీవన విధానంలో ఒత్తిడి, ఆందోళనలు సర్వ సాధారణంగా మారాయి. అయితే, కొన్ని సులభమైన, కానీ ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కొన్ని నెలల్లోనే సానుకూలంగా మార్చుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఈ 5 మంచి అలవాట్లు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడి, ఆందోళనల నుంచి దూరంగా ఉంచుతాయని వారు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

 

ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

 

ఉదయాన్నే ధ్యానం (మెడిటేషన్)..  

 రోజును 5-10 నిమిషాల ధ్యానంతో ప్రారంభించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతుంది. శ్వాస వ్యాయామాలు లేదా మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లు ఈ ప్రక్రియలో సహాయపడతాయి.

రోజువారీ వ్యాయామం..  

 రోజూ కనీసం 20-30 నిమిషాల పాటు నడక, యోగా లేదా జిమ్ వంటి శారీరక శ్రమ చేయడం ద్వారా శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఇవి సంతోషాన్ని పెంచి, ఆందోళనను తగ్గిస్తాయి.


ఆరోగ్యకరమైన ఆహారం.. 

సమతుల ఆహారం, ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు (గింజలు, ఆకుకూరలు, చేపలు) తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.

నిద్రకు ప్రాధాన్యం.. 

 రాత్రి 7-8 గంటల నాణ్యమైన నిద్ర మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి ఫోన్ వాడకాన్ని తగ్గించి, వీలైనంత త్వరగా నిద్రించడం మంచిది.

సామాజిక సంబంధాలు.. 

 కుటుంబం, స్నేహితులతో కలిసి సమయం గడపడం లేదా కొత్త వ్యక్తులతో సంభాషించడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫ్రెండ్స్ తో సరదా సంభాషణ కూడా మీ మూడ్‌ను ఉత్తేజపరుస్తుంది.


ఈ అలవాట్లను ఒకేసారి అమలు చేయడానికి బదులు, ఒక్కొక్కటిగా ప్రారంభించి, క్రమంగా మీ రోజువారీ జీవనంలో భాగం చేసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న మార్పులు కొన్ని నెలల్లోనే మీ జీవితంలో ఆరోగ్యకరమైన మార్పులను తీసుకొస్తాయి. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉండొచ్చు.  

 

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.