సాక్షి లైఫ్: గుండె జబ్బులు వయసుతో సంబంధం లేదని, ఎవరికైనా వస్తాయని, అందుకే చిన్నప్పటి నుంచి జీవనశైలి, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం, షుగర్ వ్యాధిగ్రస్తులు, హైబీపీ ఉన్నవారు, పొగతాగేవారు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవాళ్ళకు గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..అధిక రక్తపోటుకు బ్రెయిన్ స్ట్రోక్ కు లింక్ ఏంటి..?
గుండె జబ్బుల కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 1.79 కోట్ల మంది మరణించారని అంచనా. ఈ మరణాలలో 85 శాతం హార్ట్ ఎటాక్ , హార్ట్ స్ట్రోక్ కారణంగా జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే వెనుకబడిన దేశాల్లోనే గుండె జబ్బుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
రోజులో ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని జాబ్ చేసేవారు అంటే సెడెంటరీ లైఫ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకునేవాళ్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
రాకుండా ఏమేం చేయాలి..?
- వారం మొత్తమ్మీద కనీసం 150 నిమిషాలు లేదా 30 నిమిషాల చొప్పున ఐదు రోజులు నడక లేదా ఇతర శారీరక వ్యాయామం అవసరమన్నది అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహా.
- శరీర బరువు మీ వయసుకు తగ్గట్టు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం. ఊబకాయం లేకుండా చూసకోవడం
- ఉప్పు, చక్కెరతోపాటు కొవ్వు ఉత్పత్తుల మోతాదులు తగ్గించాలి.
- మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా మంచిది.
-ప్రతిరోజూ సరిపడా నిద్ర అవసరం.
40 ఏళ్ల వయస్సు తర్వాత, కొన్ని పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి.
-తద్వారా ప్రమాదాలను గుర్తించడం సాధ్యమవుతుంది.
- ఫాస్ట్ ఫుడ్, కల్తీ ఆహారం, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
- రక్తంలో 200 mg/dL కొలెస్ట్రాల్ స్థాయి సాధారణమైనదిగా పరిగణిస్తారు. 239 mg/dL అంతకంటే ఎక్కువగా ఉంటే అది గుండెకు హానికరంగా భావిస్తారు.