High Sugar Levels : షుగర్ లెవల్స్ నోటి ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయంటున్న వైద్య నిపుణులు..
సాక్షి లైఫ్ : మధుమేహం అనగానే చాలామంది కేవలం కిడ్నీలు, గుండె, కళ్లపై పడే ప్రభావం గురించే ఆలోచిస్తారు. కానీ, రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలు మన నోటి ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా 'డయాబెటిస్ క్యాపిటల్'గా మారుతున్న భారత్‌లో చిన్నా పెద్దా తేడా లేకుండా దంతాలు, చిగుళ్ల సమస్యలు అధికమవుతున్నాయి.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
పళ్లు ఊడిపోవడానికి కారణం..?
మధుమేహం నియంత్రణలో లేనప్పుడు పళ్లను పట్టి ఉంచే దవడ ఎముక క్రమంగా బలహీనపడుతుంది. దీనివల్ల పళ్లు కదలడం (Loosening) మొదలై, చివరకు ఊడిపోయే పరిస్థితి వస్తుంది. తీవ్రమైన నొప్పి భరించలేక రోగులే స్వయంగా దంతవైద్యుల వద్దకు వెళ్లి పళ్లు తీయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
చిగుళ్ల వాపు, రక్తస్రావం (Gingivitis & Periodontitis): రక్తంలో చక్కెర పెరిగినప్పుడు నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడే శక్తి శరీరానికి తగ్గుతుంది. ఫలితంగా జింజివైటిస్..చిగుళ్లు ఎర్రబడటం, వాపు రావడం. మధుమేహం ఉన్న పిల్లల్లో ఈ సమస్య 50శాతం నుంచి 90శాతం వరకు కనిపిస్తోంది.
పీరియడోంటైటిస్.. ఇది చిగుళ్ల వ్యాధి తీవ్ర రూపం. చక్కెర వ్యాధి లేనివారితో పోలిస్తే, ఉన్నవారికి ఈ ప్రమాదం రెండు రెట్లు ఎక్కువ. ఇది దంతాల చుట్టూ ఉండే కణజాలాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. నోరు ఎండిపోవడం (Xerostomia)..మధుమేహ బాధితుల్లో తరచుగా మూత్ర విసర్జన జరగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. దీనివల్ల లాలాజల గ్రంథులు సరిగ్గా పనిచేయక నోరు పొడిబారుతుంది. లాలాజలం తగ్గితే నోటిలో బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి.
గాయాలు ఆలస్యంగా మానడం..
రక్తప్రసరణలో ఆటంకాలు కలగడం వల్ల నోటిలో ఏవైనా చిన్న గాయాలైనా అవి త్వరగా తగ్గవు. గాయం ఉన్న చోటికి ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందకపోవడమే దీనికి కారణం. దీనివల్ల ఇన్ఫెక్షన్లు ముదిరి మరింత ప్రమాదకరంగా మారుతాయి.
జాగ్రత్తలు..నివారణ మార్గాలు..
ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్రష్ చేయాలి.వేళ్లతో చిగుళ్లను మృదువుగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. సరైన నోటి పరిశుభ్రత పాటించడం ద్వారా మధుమేహం తెచ్చే దంత సమస్యలను 70 నుంచి 80 శాతం వరకు నివారించవచ్చు.
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
