సాక్షి లైఫ్: ప్రతి రోజూవాక్ చేయాలనుకుంటే మొదట్లో 15-20 నిమిషాలతో ప్రారంభించి క్రమంగా సమయాన్ని పెంచుకోవాలి. సాధారణ వ్యక్తులకు 30-45 నిమిషాలు నడవడం సరిపోతుంది.నిపుణులు లేదా ఫిట్‌నెస్ ఔత్సాహికులు 60 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయవచ్చు. తీవ్రమైన వేడిలో ఎక్కువసేపు నడవడం వల్ల డీహైడ్రేషన్ లేదా హీట్ స్ట్రోక్ వస్తుందని గుర్తుంచుకోండి. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
రోజూ 30-40 నిమిషాలు నడవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి, ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, ఎంతసేపు నడిస్తే మేలు అనేదానిపై స్పష్టత కావాలి. నడక వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, శరీర బరువు నియంత్రణలో ఉంటుంది, మానసిక ఆరోగ్యం బలపడుతుంది. మరి రోజుకు ఎంత సమయం నడవాలి..?
ఎంతో నడవాలి..?
నిత్యం 30-45 నిమిషాలు నడిస్తే గుండె ఆరోగ్యానికి, కండరాల బలానికి, శరీర బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కనీసం 6,000 - 10,000 అడుగులు నడక చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వేగంగా నడిస్తే కాలరీల ఖర్చు ఎక్కువ అవుతుంది, మెటాబాలిజం మెరుగవుతుంది.
నడక ఆరోగ్య ప్రయోజనాలు..
-గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది
-రక్తపోటును నియంత్రిస్తుంది
-కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది
-మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది
-మానసిక ఒత్తిడిని తగ్గించి, మెదడుకు ఉత్తేజం ఇస్తుంది
-ఎముకలకు బలం చేకూరుస్తుంది
వేసవి కాలంలో ఉదయం 5:30 - 7:30 లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నడవడం ఉత్తమం. తగినన్ని ద్రవపదార్థాలు తీసుకుంటూ, నడవడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.