For Healthy Heart : గుండె ఆరోగ్యం కోసం ఎన్ని నిమిషాలు నడవాలి..?
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా ఈ రోజుల్లో చిన్న వయసులోనే గుండె జబ్బులు (Heart Diseases) చుట్టుముడుతున్నాయి. అయితే, అత్యంత సులభమైన, ఎలాంటి ఖర్చు లేని 'నడక' (Walking) అనే వ్యాయామంతో గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గుండె సమస్యలు ఉన్నవారు కూడా నడకను కొనసాగించడం మంచిదని, ఇది గుండెపై భారం పెంచకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. హృదయానికి నడక ఎలా మేలు చేస్తుంది?ప్రతిరోజూ కేవలం 30 నిమిషాల పాటు చురుకైన నడకను అలవాటు చేసుకుంటే మీ గుండె పనితీరుపై అద్భుతమైన ప్రభావం చూపుతుంది.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
వాకింగ్ చేయడం వల్ల గుండె కండరాలు బలంగా మారతాయి. దీనితో రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్తపోటు (Blood Pressure) అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణ.. నడక మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచి, చెడ్డ కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గిస్తుంది. రక్తప్రసరణ మెరుగుదల..రక్తప్రసరణ సరిగా జరిగి, గుండెకు ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా ఉంటుంది. గుండెపోటు, స్ట్రోక్ ముప్పు తగ్గింపు.. రోజూ చురుకుగా నడిచే వారిలో గుండెపోటు (Heart Attack), స్ట్రోక్ ప్రమాదం 30 శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
బరువు, చక్కెర నియంత్రణ.. నడక బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.గుండె కోసం రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? రోజువారీ నడక విషయంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. గతంలో 10,000 అడుగులు నడవాలని చెప్పేవారు. అయితే, ప్రస్తుత పరిశోధనల ప్రకారం, మీ వయస్సు, ఫిట్‌నెస్ స్థాయిని బట్టి ఈ సంఖ్యలో మార్పులు ఉన్నాయి. వయస్సుసిఫార్సు చేసిన అడుగులు కనీసం సుమారు దూరం.. యువకులు (18-40)12,000 అడుగులుసుమారు 8 కిలోమీటర్లు, మధ్య వయస్సు (40+)11,000 అడుగులు 7-8 కిలోమీటర్లు, వృద్ధులు (60+)6,000 - 9,000 అడుగులు, సుమారు 4.8 - 7.2 కిలోమీటర్లు. రోజుకు కనీసం 8 వేల అడుగులు నడిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుందని స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రనాడా పరిశోధకులు చెబుతున్నారు.
నడకను మీ దినచర్యలో భాగం చేసుకోవడానికి నిపుణుల చిన్న చిట్కాలు.. మొదటి రోజే 10,000 అడుగులు నడవడానికి ప్రయత్నించకుండా, మొదట్లో 2,500 నుంచి 3,000 అడుగులతో ప్రారంభించి, నెమ్మదిగా పెంచండి. భోజనం తర్వాత నడక.. ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాలు నడిచినా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఒత్తిడి తగ్గుతుంది.. నడక మెదడులో ఎండార్ఫిన్లను విడుదల చేసి, మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. నీరు, ఆహారం ముఖ్యం.. నడకతో పాటు క్రమం తప్పకుండా నీరు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా గుండెకు చాలా అవసరం.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
