బలమైన ఎముకల కోసం హెల్తీ ఫుడ్..
సాక్షి లైఫ్ : ప్రస్తుతం చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, చిన్న చిన్న గాయాల కారణంగా ఎముకలు విరిగిపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవా లనుకునేవాళ్ళు పాలు తాగితే సరిపోతుందనుకుంటారు. పాలు ఒక్కటే కాదు కాల్షియం లోపాన్ని అధిగమించడానికి మీరు మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన పదార్థాలు మరికొన్ని ఉన్నాయి. అవేంటంటే..?
ఆరోగ్యకరమైన ఎముకల కోసం ఎలాంటి ఫుడ్ అవసరమంటే..?
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎముకలపై తీవ్రప్రభావాన్ని చూపుతాయి. దీనికి ప్రధాన కారణం కాల్షియం లోపం. దీని కారణంగా మొత్తం శరీరం నిర్మాణం క్షీణిస్తుంది. అందువల్ల, ఎముకల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎముకలను బలంగా ఉంచుకోవాలనుకుంటే, పాలు కాకుండా, శరీరంలోని కాల్షియం లోపాన్ని భర్తీ చేసే పదార్థాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సోయాబీన్..
ఎముకలను దృఢంగా ఉంచుకోవాలంటే మీ ఆహారంలో సోయాబీన్‌ను చేర్చుకోవాలి. 100 గ్రాముల సోయాబీన్‌లో 277 mg కాల్షియం లభిస్తుంది. ఇది మీకు బలమైన ఎముకలను అందించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సోయాబీన్ ను రోజూ మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకల సాంద్రతను మెరుగుపరచుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కావాలంటే..ఈ విత్తనాలు తినాలి..
డ్రై ఫ్రూట్స్..
పిస్తాపప్పులు, వాల్‌నట్‌లు, బాదం పప్పులే కాకుండా, పలు రకాల డ్రై ఫ్రూట్స్‌లో కూడా కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం లభిస్తాయి. ఈ పోషకాలన్నీ మీ ఎముకలకు చాలా ముఖ్యమైనవి. ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు కేవలం పాలపైనే ఆధారపడకుండా వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
(జున్ను) చీజ్..
100 గ్రాముల చీజ్‌లో కాల్షియం కంటెంట్ దాదాపు 1048 మిల్లీగ్రాములు ఉంటుంది. కాబట్టి మీ శరీరంలో కాల్షియం లోపం ఉంటే చీజ్ తీసుకోవడం ఉత్తమం. పాలు తాగడానికి ఇష్టపడని వారికి పనీర్ మంచి ఎంపిక. దీంతో తో మీరు వివిధ రకాల రుచికరమైన వంటకాలను చేసుకొని తినొచ్చు.
ఆకు కూరలు..
బచ్చలికూర,పాలకూర, మెంతికూర వంటి ఆకు కూరలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే ఎముకలకు అవసరమైన కాల్షియం పొందవచ్చు.
ఇది కూడా చదవండి.. ఓట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
