Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్.. తొలిదశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రముఖ బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే (Stage-Zero) గుర్తించి, శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా బయటపడటం ఇటీవల విస్తృత చర్చనీయాంశ మైంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా ముదిరే వరకు స్పష్టమైన సంకేతాలు చూపదు. అయితే సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స సులువవుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి లక్షణాలు, కారణాలు, నివారణోపాయాలపై ప్రత్యేక కథనం..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఊపిరితిత్తుల్లోని కణాలు నియంత్రణ లేకుండా అసాధారణంగా పెరిగి కణితి (tumor) రూపం దాల్చడమే లంగ్ క్యాన్సర్. ఇందులో నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ,సుమారు 80శాతం నుంచి 85శాతం కేసులు, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనే రెండు ప్రధాన రకాలుంటాయి. ప్రారంభంలో గుర్తించకపోతే ఈ కణాలు శరీరంలోని ఇతర భాగాలకూ వేగంగా వ్యాపిస్తాయి.

హెచ్చరిక సంకేతాలు, వీటిని తేలిగ్గా తీసుకోవద్దు..

తీవ్రమైన దగ్గు..వారాల తరబడి తగ్గని పొడి దగ్గు లేదా గొంతులో మార్పు. దగ్గులో రక్తం.. దగ్గినప్పుడు రక్తం పడటం లేదా కళ్లెలో రక్తపు చారలు కనిపించడం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. చిన్న పనులకే ఆయాసం రావడం, ఛాతీలో నిరంతరం నొప్పి. స్వరంలో మార్పు.. గొంతు బొంగురుపోవడం (Hoarseness), అది దీర్ఘకాలం కొనసాగడం. బ్రాంకైటిస్ లేదా న్యుమోనియా వంటి సమస్యలు పదేపదే తిరగబెట్టడం. ఆహారంలో మార్పు లేకున్నా బరువు పడిపోవడం, నిరంతర నీరసం.

పొగతాగని మహిళల్లో ముప్పు ఎందుకు పెరుగుతోంది..?

ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణమైనప్పటికీ, ఎన్నడూ సిగరెట్ ముట్టని మహిళల్లోనూ ఈ వ్యాధి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో లేదా పని ప్రదేశంలో ఇతరులు తాగే సిగరెట్ పొగను పీల్చడం. బొగ్గు, కట్టెల పొయ్యిల నుంచి వెలువడే పొగను ఎక్కువ కాలం పీల్చడం, వాహనాలు, పరిశ్రమల వాయు కాలుష్యం. రేడాన్ వాయువు, ఆస్బెస్టాస్ వంటి హానికర రసాయనాల ప్రభావం. కుటుంబంలో రక్తసంబంధీకులకు క్యాన్సర్ చరిత్ర ఉండటం.

నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ధూమపానానికి దూరం: సిగరెట్, బీడీ లేదా ఇతర పొగాకు ఉత్పత్తులకు తక్షణమే స్వస్తి పలకాలి. వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు మాస్కులు ధరించడం, ఇంట్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. రసాయనాలు, ధూళి ఉండే కర్మాగారాల్లో పనిచేసేవారు రక్షణ పరికరాలను తప్పనిసరిగా వాడాలి. దీర్ఘకాల ధూమపాన అలవాటు లేదా కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు వైద్యుల సలహాతో ఎల్‌డీసీటీ (Low-Dose CT) వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.