సాక్షి లైఫ్ : అధిక బరువు సమస్య నుంచి బయటపడాలంటే..? అనేక ఆరోగ్య సూత్రాలు పాటించాలి. వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. నడక, జాగింగ్, యోగా వంటివి చేయండి. సరిపడా నీరు తాగడం ద్వారా మీ శరీరం హైడ్రేటెడ్‌గా ఉండడమే కాకుండా, ఆకలి తగ్గుతుంది. ఆహార నియమాలు: అనవసరమైన పద్ధతుల మీద మానుకోండి, ఉదాహరణకు ఫాస్ట్ ఫుడ్, ఎనర్జిటిక్ డ్రింక్స్. మానసిక ఆరోగ్యం: మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది మీ శరీరానికి మంచి ఆరోగ్యం కోసం కూడా అవసరం.
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి "టీ" తాగడం కూడా ఒక కారణమేనా..?
ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు
ఆహారాల మోతాదును నియంత్రించండి, ఎన్ని కాలరీలు తీసుకుంటున్నారో గమనించండి. సమతుల ఆహారం: కూరగాయలు, పండ్లు, పూర్తి ధాన్యాలు, ప్రోటీన్లు ,ఆరోగ్యకరమైన కొవ్వులను సమానంగా తీసుకోండి.
నిద్ర: సరైన నిద్ర పోవడం కూడా బరువు అదుపులో ఉంచటానికి చాలా ముఖ్యం. అంతేకాదు ప్రతి రోజు ఈ చిట్కాలను పాటిస్తే, మీ బరువును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆయుర్వేద వైద్యంలో పలురకాల మూలికలు వినియోగిస్తారు. బెల్లం టీ , అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ ఇలా ఒకటేమిటి..? టీ లో అనేక రకాలున్నాయి. వీటిల్లో బ్లూ "టీ" కూడా ఒకటి. అపరాజిత టీని బ్లూ టీ అంటారు. అపరాజిత పువ్వును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ అపరాజిత పువ్వులో ఉన్నాయి. ఈ పువ్వును శంఖు పువ్వు, బటర్ ఫ్లై పీ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తపోటును నియంత్రించడంలో, బరువు తగ్గడంలో సహాయపడతాయి. బ్లూ టీ తాగడం వల్ల కలిగే లాభాలు, దానిని తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి..
బ్లూ టీ తీసుకోవడం వల్ల మనిషిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ టీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అపరాజిత పువ్వుతో తయారుచేసిన "టీ" మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టీలో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి, దీని కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
బ్లడ్ ప్రజర్..
అపరాజిత పుష్పాలతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
బ్లూ టీ తీసుకోవడం ద్వారా వృద్ధాప్య సమస్యను అధిగమించవచ్చు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ముఖంపై ఉండే ముడతలతోపాటు, వృద్ధాప్య లక్షణాలు తొలగి పోవడమే కాకుండా యవ్వనంగా కనిపిస్తారు.
ఓవర్ వెయిట్..
పెరుగుతున్న బరువును నియంత్రించడంలో ఈ టీ సమర్థవంతమైన పనితీరు కనబరుస్తుంది. కాబట్టి బరువు తగ్గాలంటే అపరాజిత పువ్వులతో చేసిన టీని ప్రతి రోజూ ఉదయం తాగాలి. ఈ టీ తాగడం వల్ల మెటబాలిజం పెరిగి కొవ్వు కరిగిపోతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి..కృత్రిమ చక్కెర వాడితే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి..ఎంపాక్స్ ని నివారించే మార్గాలు..
ఇది కూడా చదవండి..ఇలాంటి జాగ్రత్తలు లేకపోతేనే మధుమేహ సమస్య వస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com