బరువు పెరగడానికి "టీ" తాగడం కూడా ఒక కారణమేనా..?  

సాక్షి లైఫ్ : పొద్దునే "టీ" తాగనిదే చాలామంది మరొక పని మొదలు పెట్టారు. కొందరు అంతగా "టీ"ని ఇష్టపడుతూ ఉంటారు. తేనీరు అనేది ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తుంది..? ఎంతవరకు హాని చేస్తుందనేది ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువగా "టీ" తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..?  

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

దంతాలకు హాని.. 

 "టీ "మీ దంతాలకు హాని చేస్తుందని మీకు తెలుసా? అవును, నిజమే! టీలో ఉండే యాసిడ్ మన దంతాల ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. దీని వల్ల దంతాల పసుపు రంగులోకి మారడమే కాకుండా సున్నితంగా తయారవుతాయి. అందువల్ల ఒక నెల పాటు "టీ" తాగకుండా ఉండడం ద్వారా మీ దంతాల రంగు క్రమంగా సహజంగా మెరుస్తాయి. అంతేకాదు దంత క్షయం నుంచి ఉపశమనం పొందవచ్చు.


బరువు పెరగడానికి కారణమవుతుందా..?

టీ కూడా మీ బరువు పెరగడానికి కారణమవుతుంది ఆ విషయం మీకు తెలుసా..? టీ , కాఫీలలో చక్కెర ఎక్కువగా వాడుతారు. చక్కెరలో కెఫిన్ ఉంటుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది.   అంతేకాదు జీవక్రియపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు క్రమం తప్పకుండా టీ తాగడం ఒక నెల పాటు దానికి దూరంగా ఉంటే, మీరు బరువు తగ్గడంలో ఎంతమేర ప్రయోజనాలు ఉన్నాయే చూడవచ్చు.

 నిద్రను ఎలా ప్రభావితం చేస్తుంది..?

మీరు రోజంతా అలసిపోయి, రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారా? అవును అయితే, టీ పట్ల మీకున్న ఇష్టమే దీనికి కారణమయ్యే అవకాశం ఉంది. అవును, మీరు ఒక నెల పాటు టీని పూర్తిగా మానేస్తే, మీరు రాత్రి త్వరగా నిద్రపోగలుగుతారు. ఉదయం కూడా రిఫ్రెష్‌గా ఉండగలుగుతారు.   "టి" తాగడం మానేయడం వల్ల నిద్ర పెరగడమే కాకుండా ఆందోళన, ఒత్తిడి కూడా తగ్గుతుంది.

మధుమేహం అదుపులో ఉంటుందా..?

"టీ"లోని చక్కెర రక్తంలో చక్కెర స్థాయిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు "టీ" ఒక నెల పాటు మానేస్తే, అది మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించలేకపోవచ్చు, కానీ మీరు రక్తంలో చక్కెరలో హెచ్చుతగ్గుల నుంచి ఖచ్చితంగా ఉపశమనం పొందవచ్చు.  

ఇది కూడా చదవండి.."టీ" తాగడం మానేస్తే రక్తపోటు నుంచి విముక్తి కలుగుతుందా..?

 

ఇది కూడా చదవండి..అనుమతులు లేని ఆటిజం థెరపీ సెంటర్లతో పిల్లల ప్రాణాలకు ముప్పు..

 

ఇది కూడా చదవండి..ఆయుర్వేదంలో కూరగాయలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : mental-health stress diabetes dental-problems weight-loss tea healthy-habits side-effects over-weight sleep digestive-problems bad-habit drinking-tea metabolism weight-gain

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com