సాక్షి లైఫ్ : కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పలు రకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.. ప్రపంచంలో ఎక్కువమంది బాధపడేది.. రెండురకాల సమస్యలు.. అవి ఒకటి మధుమేహ సమస్య, రెండోది రక్తపోటు. ఇవి రెండింటినీ రాకుండా చేయాలంటే తప్పనిసరిగా కొన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ లోపం ఉన్నప్పుడు, అంటే తక్కువ మొత్తంలో ఇన్సులిన్ పంపిణీ అవుతుంది, అప్పుడు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిని మధుమేహం అంటారు. మధుమేహానికి ప్రధాన కారణాలలో జీవనశైలి, ఒత్తిడి , అధిక మద్యపానం ఉన్నాయి. అంతేకాదు డయాబెటీస్ కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ మనిషికి ఎలా ఉపయోగపడుతుంది..?
ఇది కూడా చదవండి..మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే ఎలాంటి యోగాసనాలు చేయాలి..?
ఇది కూడా చదవండి..ఈ సీజన్ లో తినకూడని ఆహారాలివే..
ఇది కూడా చదవండి..పోషకాహార లోపాన్ని ఎలా గుర్తించాలి..?
.
తీవ్ర ప్రభావం..
భారతదేశంలో మధుమేహం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది ప్రస్తుతం జనాభాలో 11.4 శాతం అంటే, దాదాపు 101 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది. అలాగే జనాభాలో 15.3శాతం లేదా దాదాపు 136 మిలియన్ల మంది ప్రజలు ప్రీ-డయాబెటిక్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండటానికి, దానిని సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. ఇందులో ఆహారం, వ్యాయామం కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు దినచర్యలో యోగా, నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి ఖచ్చితంగా చేయాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.
ఈ పదార్థాలే కారణం..
మధుమేహానికి కొన్నిరకాల పదార్థాలు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లను వదిలేస్తేనే షుగర్ వ్యాధి తలెత్తదని వారు వెల్లడిస్తున్నారు. మధుమేహాన్ని "చక్కెర వ్యాధి" అని కూడా అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి గురించి ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. మధుమేహం కూడా జన్యుపరంగా వచ్చే వ్యాధే. అంతేకాదు జీవనశైలి కారణంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
డయాబెటిక్ రోగి రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండటం లేదా సాధారణం కంటే తక్కువగా ఉండకూడదు. కాబట్టి ఈ ఉగాది ఉన్నవారు షుగర్ లెవల్ ని ఎప్పటికప్పుడు టెస్టు చేయించుకోవాలి. చక్కెర స్థాయి ఆకస్మికంగా పెరగడం లేదా ఆకస్మికంగా తగ్గడం, రెండు పరిస్థితులు రోగికి ప్రమాదకరమే. మధుమేహానికి కారణమయ్యే 7 'ఎస్'లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిశ్చల జీవనశైలి(సెడెంటరీ లైఫ్ స్టైల్)..
శారీరక శ్రమ లేకపోతే, అనేక వ్యాధులను ఆహ్వానిస్తున్నారని అర్థం చేసుకోండి. నిజానికి మనం ఏది తిన్నా, ఏ విధమైన కార్యకలాపాలు చేయకున్నా అది శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల ఊబకాయ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య అనేక హార్మోన్ల మార్పులకు కారణమవుతుంది, ఇది శరీరం పనితీరును ప్రభావితం చేస్తుంది.
ఒత్తిడి (స్ట్రెస్)..
ఎలాంటి ఒత్తిడి అయినా ఆరోగ్యానికి హానికరమే. ఎందుకంటే ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. బీపీ పెరగడం వల్ల షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది.
ఉప్పు(సాల్ట్)..
ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల అది బిపిని పెంచుతుంది. బ్లడ్ ప్రెజర్ పెరిగితే షుగర్ లెవల్స్ ని ప్రభావితం చేస్తుంది.
నిద్ర (స్లీప్)..
మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది ఒత్తిడిని తొలగిస్తుంది. ఒత్తిడిని తొలగించడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయి. రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరిగా అవసరం.
చక్కెర(షుగర్)..
ఆహారంలో చక్కెర లేదా తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మీరు తీపి పదార్థాలను ఇష్టపడితే, చక్కెర స్థాయి పెరగకుండా చూసుకోవడానికి శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
ధూమపానం (సిగరెట్)..
ధూమపానం ఊపిరితిత్తులతో పాటు గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది.
మద్యపానం (స్పిరిట్స్)..
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం వల్ల ఊబకాయంతో పాటు బీపీ, షుగర్ కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?