ఎంపాక్స్ ని నివారించే మార్గాలు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎం పాక్స్ (మంకీ పాక్స్)వ్యాధి.. ప్రపంచదేశాలను సైతం వణికిస్తోంది. ఇప్పటికే భారతదేశంలోనూ పలుచోట్ల కేసులు నమోద య్యాయి. కొన్నిరకాల జాగ్రత్తలు పాటించడం ద్వారా మంకీ పాక్స్ వ్యాప్తిని కొంతమేర నియంత్రించవచ్చు. అందుకోసం ఏమేం చేయాలి..? ఏమేం చేయకూడదు..? అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..


పరిశుభ్రత పాటించండి.. 

క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి, పరిసరాల పరిశుభ్రతను పాటించండి. ఈ వ్యాధి సోకిన వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి: ఒక వ్యక్తిలో మంకీ పాక్స్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే, అతని నుంచి దూరంగా ఉండాలి. మాస్క్ , గ్లోవ్స్ ఉపయోగించండి: ప్రత్యేకించి మీరు వ్యాధి సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్, చేతులకు గ్లోవ్స్ తప్పనిసరిగా వాడాలి. జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండండి: ముఖ్యంగా కోతులు,ఎలుకలు వంటి జంతువులకు దూరంగా ఉండండి. వ్యాధి సోకిన చర్మాన్ని కప్పి ఉంచండి: గాయాలు, పొక్కులను కప్పి ఉంచండి. ఎక్కువగా నీరు త్రాగాలి.

ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యమంటే..?

మంకీ పాక్స్ వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో ఇతర వైరల్ ఇన్ఫెక్షన్‌లను పోలి ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. శరీరంపై బొబ్బలు లేదా దద్దుర్లు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించండి. రోగనిర్ధారణ చాలా ముఖ్యం, ఎందుకంటే తద్వారా వ్యాధి తీవ్రతను నిరోధించవచ్చు.

లక్షణాలు - అవగాహన..  

భారత ప్రభుత్వం అనేక ఆరోగ్య కేంద్రాలు,ఆసుపత్రులలో మంకీ పాక్స్ వ్యాధిని గుర్తించడానికి ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటుచేసింది. కాబట్టి ప్రజలు దీని గురించి తెలుసుకోవాలి. ప్రాథమిక లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆయా వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు డేంజర్

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.