సి విటమిన్ లోపాన్ని ఎలా అధిగమించాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : రోగనిరోధకశక్తిని పెంచేవాటిలో అత్యంతగా ఉపయోగపడేది విటమిన్ "సి"నే. ఇది ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. ఇది శరీరానికి కావాల్సిన ఇమ్మ్యూనిటీ పవర్ ను పెంచి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. కాబట్టి విటమిన్ "సి" ని అందించే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం రోజువారీ ఫుడ్ మెనూలో ఈ ఆహారాలను చేర్చుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
బొప్పాయి..
బొప్పాయిలో 200 శాతం కంటే ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఒక్క విటమిన్ సి మాత్రమే కాదు, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. బొప్పాయి శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పని చేయడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
బ్రోకలీ..
బ్రోకలీలో విటమిన్ "సి", విటమిన్ "కె", విటమిన్ "ఎ" ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. శీతాకాలంలో, మీరు సూప్, కూరగాయలు లేదా సలాడ్ రూపంలో మీ ఆహారంలో బ్రోకలీని చేర్చుకోవచ్చు. దీని రోజువారీ వినియోగం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అరకప్పు ఉడికించిన బ్రోకలీ రోజువారీ విటమిన్ "సి"లో 57 శాతం అందించగలదు.
జామ..
శీతాకాలంలో దొరికే తీపి- పుల్లని రుచికరమైన పండు జామ, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ పండుప్రయోజనాలను పొందడానికి మీరు దీన్ని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. పింక్ జామపండ్లలో విటమిన్ "ఎ" ,"సి", అలాగే ఒమేగా 3, ఒమేగా 6 పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు , ఫైబర్ అధికంగా ఉంటాయి.
నారింజ..
నారింజ విటమిన్ "సి" ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. ఈ పండు ప్రత్యేకత ఏమిటంటే..? ఇది చలి కాలంలో సులభంగా దొరుకుతుంది. వింటర్ సీజన్‌లో ఆరెంజ్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
క్యాప్సికమ్..
క్యాప్సికమ్ విటమిన్ 'సి"తో పాటు విటమిన్ "ఎ" ఫైబర్ మంచి మూలంగా కూడా పరిగణిస్తారు. ఒక మీడియం-సైజ్ రెడ్ బెల్ పెప్పర్ తినడం వల్ల మీకు రోజువారీ అవసరమైన 169 శాతం విటమిన్‌ను అందిస్తుంది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
