బర్డ్ ఫ్లూ సంకేతాలను ఎలా గుర్తించాలి..?

షేర్ చేయండి:
బర్డ్ ఫ్లూ సంకేతాలను ఎలా గుర్తించాలి..?

సాక్షి లైఫ్ : బర్డ్ ఫ్లూ లక్షణాలు చాలా వరకూ సాధారణ ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. ఇన్ఫెక్షన్ సోకిన వారికి దగ్గు, విరేచనాలు, జ్వరంతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, కండరాల నొప్పి, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేక గదిలో ఉంచడం మంచిదని, లేకపోతే ఈ వ్యాధి మరొకరికి సోకే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ అలెర్ట్ : అప్రమత్తమైన తెలంగాణ సర్కార్..

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

 

ముఖ్యంగా బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు తీసుకోవడం ఉత్తమం. ఈ ఇన్ఫెక్షన్‌ని కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయడం ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోవడం, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించడానికి వీలవుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

అయితే బర్డ్ ఫ్లూ లక్షణాలు ఒక్కో సందర్భంలో అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో కళ్లకు ఇన్ఫెక్షన్ తోపాటు వికారంగా ఉండడం, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పి, గొంతు మంట లేదా నొప్పి, ఫీవర్ వంటివి ప్రధానంగా కనిపించవచ్చు. 

 

ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?

ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.