వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?

షేర్ చేయండి:
వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?

సాక్షి లైఫ్ : సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం సిగరెట్. భారత దేశం వంటి దేశంలో ఈ వ్యాధి ధూమపానం చేయనివారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ప్రధాన కారణాలు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ , వాయు కాలుష్యం, కుటుంబ చరిత్ర. పర్టిక్యులేట్ పదార్థం కారణంగా కూడా ఊపిరితిత్తుల కణాలలో మార్పులు కనిపిస్తాయి. దీని వల్ల లంగ్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.

ధూమపానం చేయని వారిలో అడెనోకార్సినోమా అనే క్యాన్సర్ పెరుగుతోంది. ఇది ఒక రకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇది ఊపిరితిత్తుల బయటి పొర నుంచి మొదలై క్రమంగా మొత్తం భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ క్యాన్సర్ వాతావరణ కాలుష్యం వల్ల వస్తుంది. అందుకే ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వాయుకాలుష్యానికి ఎక్కువ కాలం గురికావడం వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

ధూమపానం చేసేవారి దగ్గర ఉండడం వల్ల.. 
 
అంతే కాకుండా ధూమపానం చేసేవారి దగ్గర ఉండటం వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సిగరెట్ పొగ ఉండే వాతావరణంలో నివసించడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో, కుటుంబ చరిత్ర కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం కావచ్చు. పొగ గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిజానికి, పొగకు గురికావడం వల్ల రక్తనాళాల సైజు తగ్గిపోతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. బ్రోన్కైటిస్ , ఆస్తమా వంటివి సంభవించవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు.. 

నిరంతర దగ్గు
ఊపిరి ఆడకపోవడం
ఛాతీ లేదా భుజం నొప్పి
నోటి నుంచి రక్తం
అలసట
కీళ్ల నొప్పులు
ఆహారం మింగడం కష్టంగా అనిపించడం..  

 

ఇది కూడా చదవండి..రూట్ కెనాల్ విధానంలో ఏయే దశలు ఉంటాయి..?

ఇది కూడా చదవండి..చలికాలంలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..?

ఇది కూడా చదవండి..వింటర్ సీజన్ అలర్ట్ : ఉసిరిలో అనేక ఔషధ గుణాలు.. 

ఇది కూడా చదవండి..డిజిటల్ యుగంలో యువతలో స్ట్రోక్ కేసులు..పెరగడానికి ఈ అలవాట్లే కారణం.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.