లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..  

షేర్ చేయండి:
లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..  

సాక్షి లైఫ్ : లిప్ స్టిక్ లో ఉండే లెడ్, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం శరీరంలోకి చేరితే చాలా ప్రమాదం. లిప్ స్టిక్ లో ఉండే అల్యూమినియం అల్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది.కొంతమంది మహిళలు లిప్‌స్టిక్‌ను ఐషాడోగా ఉపయోగిస్తారు. ఇది కళ్ళకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో లిప్ స్టిక్ ను నిరంతరం వాడటం వల్ల సమస్యగా మారవచ్చు.నిరంతరం లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల కూడా కిడ్నీపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?

ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే.. 

 

లిప్‌స్టిక్‌ తయారీలో అనేక రసాయనాలు కలుపుతారు. లిప్‌స్టిక్‌ నిరంతరం ఉపయోగించడం వల్ల అలర్జీలు లేదా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. లిప్‌స్టిక్‌ను  పెదాలకు అప్లై చేయడం వల్ల సహజమైన రంగు పోయి నల్ల బడుతాయి. పెదవులకు వేసుకున్న లిప్ స్టిక్ ఏదైనా తినేటప్పుడు ఆహారం ద్వారా కడుపులోకి ప్రవేశించి అనేక వ్యాధులకు కారణమవుతుంది.


లిప్‌స్టిక్ సైడ్ ఎఫెక్ట్స్ ను ఎలా నివారించవచ్చు..? 

 వారానికి 3 సార్లు కంటే ఎక్కువ లిప్ స్టిక్ వేసుకోకూడదు.
కెమికల్స్ లేని,  పారాబెన్ లేని లిప్‌స్టిక్‌ను మాత్రమే ఎంచుకోండి.
  లిప్ స్టిక్ ను ఎక్కువ సమయం ఉంచొద్దు.
మంచి బ్రాండ్ లిప్ స్టిక్ మాత్రమే వాడండి..  
 హెర్బల్ లిప్‌స్టిక్స్ మాత్రమే ఎంచుకోండి. ఇలాంటివి వాడడం వల్ల  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 
 లిప్ స్టిక్ వేసుకునే ముందు, పెదవులపై బేస్ అప్లై చేయండి, దీని కోసం కన్సీలర్ ఉపయోగించండి.
 డార్క్ లిప్‌స్టిక్‌ను ఎంచుకునేటప్పుడు, పదార్థాన్ని చూడండి.
 గర్భధారణ సమయంలో లిప్ స్టిక్ వేసుకోవడం మానుకోండి.

 

ఇది కూడా చదవండి..చలికాలంలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..?

ఇది కూడా చదవండి..వింటర్ సీజన్ అలర్ట్ : ఉసిరిలో అనేక ఔషధ గుణాలు.. 

ఇది కూడా చదవండి..డిజిటల్ యుగంలో యువతలో స్ట్రోక్ కేసులు..పెరగడానికి ఈ అలవాట్లే కారణం.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.