పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే..
సాక్షి లైఫ్ : భారత రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం విధ్వంసం సృష్టిస్తోంది. దీని కారణంగా ధూమపానం చేయని వారిలో కూడా లంగ్ క్యాన్సర్ వంటి మహమ్మారి వస్తోంది. దీనికి ప్రధాన కారణాలు స్మోకింగ్, వాయు కాలుష్యం, కుటుంబ సభ్యులలో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉన్నవారికి ఈ మహమ్మారి వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే లంగ్ క్యాన్సర్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా కొంత వరకు ఆయా వ్యాధి రాకుండా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి..స్ట్రోక్‌ను నిరోధించే 6 అంశాలు..?
ఇది కూడా చదవండి..పీసీ ఓడీ, పీసీ ఓఎస్ కు ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..రూట్ కెనాల్ విధానంలో ఏయే దశలు ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..?
ఇది కూడా చదవండి..వింటర్ సీజన్ అలర్ట్ : ఉసిరిలో అనేక ఔషధ గుణాలు..
ఇది కూడా చదవండి..డిజిటల్ యుగంలో యువతలో స్ట్రోక్ కేసులు..పెరగడానికి ఈ అలవాట్లే కారణం..
భారతదేశంలో ధూమపానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా వారు తీవ్రమైన వ్యాధుల నుంచి తమను తాము రక్షించు కోవచ్చు. అదే సమయంలో ఎప్పుడూ పొగతాగని వారు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి వాయుకాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తేలింది. ధూమపానం చేయని వారికి ప్రస్తుతం స్క్రీనింగ్ మార్గదర్శకాలు లేవని, తద్వారా ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యం కారణమని నమ్ముతారు. ఢిల్లీ లాంటి నగరంలో ఏక్యూఐ చాలా దారుణంగా ఉంది. కాలుష్యం చిన్నారులకు సైతం తీవ్ర ముప్పుగా మారింది. కాలుష్య కారకాలు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి. వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచుతుంది. భారతదేశంలోని ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో ఎక్కువ మంది ధూమపానం చేయనివారేనని తాజా పరిశోధనలో తేలింది. వాయుకాలుష్యానికి గురికావడమే దీనికి ప్రధాన కారణమని వెల్లడైంది.
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ కు కారణాలు..? పరిష్కారాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
