డెంగ్యూ అలెర్ట్ : దోమలను నివారించడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి..?  

షేర్ చేయండి:
డెంగ్యూ అలెర్ట్ : దోమలను నివారించడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి..?  

సాక్షి లైఫ్ : కొన్ని చర్యలు చేప్పట్టడం ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. ఇందుకోసం దోమలు వృద్ధి చెందకుండా పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఆరోగ్యానికి హాని కలిగించే దోమలను తరిమికొట్టడానికి చాలా మంది రసాయన ఉత్పత్తులు వినియోగిస్తారు. అలా కాకుండా సహజ పద్ధతుల ద్వారా దోమలను ఎలా నివారించవచ్చు..? అందుకోసం ఏమి చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?

ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే..ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇటీవల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. డెంగ్యూ జ్వరం ప్రాభవంతో శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. డెంగ్యూ ఫీవర్ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీని ఇన్ఫెక్షన్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఏడిస్ జాతికి చెందిన దోమ కాటు వల్ల వస్తుంది. ఇంటి చుట్టూ ఉన్న మురికి కాలువల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ దోమలు మీ ఇంట్లో ఉంచిన కూలర్లు, కుండలలో ఉండే నీటిలో కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ దోమలను వదిలించుకోవాలంటే..?  

డెంగ్యూ ప్రమాదాన్ని నివారించడానికి.. 

మొక్కలు.. 

దోమలను తరిమికొట్టడానికి ఉపయోగపడే కొన్ని మొక్కలు ఉన్నాయి. అటువంటివాటిలో వేప, తులసి, యూకలిప్టస్ మొదలైనవి ఉన్నాయి. మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలను పెంచుకోవడం ద్వారా ఆయా దోమల బెడద నుంచి కొంత విముక్తి కలుగుతుంది.

సూర్యకాంతి.. 

ఇంటి కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసి ఉంచితే దోమలు కూడా వ్యాప్తి చెందుతాయి. పగటిపూట ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం మంచిది, తద్వారా సూర్యకాంతి, గాలి ఇంట్లోకి వస్తాయి. ఒకవేళ ఇంట్లో సూక్ష్మక్రిములు పెరిగినా, అవి సూర్యరశ్మి కారణంగా చనిపోతాయి.

ఇంటి శుభ్రత.. 

డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, కూలర్లలోగానీ, కుండలో గానీ నీరు లేకుండా చూసుకోండి. కూలర్ ఉపయోగంలో లేనప్పుడు అందులో నీళ్లు పోయకుండా శుభ్రం చేసి మూత పెట్టాలి. చాలా సార్లు, కుండలో అవసరమైన దానికంటే ఎక్కువ నీరు ఉంచినప్పటికీ దోమలు వృద్ధి చెందుతాయి.

 కాలువలు.. 

డెంగ్యూ రాకుండా ఉండాలంటే కాలువలను శుభ్రం చేసుకోవాలి. డ్రెయిన్ వాటర్ వెళ్లే కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. లేదంటే దీని వల్ల దోమలు సులువుగా వృద్ధి చెంది అనేక ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తాయి.

దోమతెర... 

పడుకునేటప్పుడు తప్పనిసరిగా దోమతెరను ఉపయోగించాలి. అంతే కాకుండా దోమలు ఎక్కువగా పెరిగే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి. సాయంత్రం పూట పార్కు ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి తిరిగే సమయంలో అటువైపు వెళ్ళకపోవడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

ఇది కూడా చదవండి..అధిక బరువును అదుపులో ఉంచడానికి కొన్ని చిట్కాలు ఇవిగో..

 

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.