హెచ్3ఎన్2 వైరస్ నివారణ ఎలా..?
సాక్షి లైఫ్ : కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా హెచ్3ఎన్2 వైరస్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని వైద్యలునిపుణుల సూచిస్తున్నారు. పరిశుభ్రత పాటించండి: చేతులను తరచుగా సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి లేదా హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించాలి. మాస్క్ ధరించండి: రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి.
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
సామాజిక దూరం: దగ్గు, జలుబు ఉన్నవారికి దూరంగా ఉండాలి. సొంత వైద్యం వద్దు: జ్వరం, దగ్గు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సొంతంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ఈ వైరస్‌కు యాంటీబయాటిక్స్ పని చేయవు. నీళ్లు పుష్కలంగా తాగాలి: శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడానికి ఎక్కువ నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోండి: జ్వరం వచ్చినప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం.
ఆందోళన వద్దు.. అప్రమత్తత అవసరం..
హెచ్3ఎన్2 వైరస్ ప్రాణాపాయం కలిగించేంత తీవ్రమైనది కానప్పటికీ, నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉంటే, లేదా జ్వరం 3 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?
ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
