కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వచ్చే గుండెజబ్బులను ఎలా నివారించాలి..? 

షేర్ చేయండి:
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వచ్చే గుండెజబ్బులను ఎలా నివారించాలి..? 

సాక్షి లైఫ్ : శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడంవల్ల గుండె జబ్బులు మరింతగా వచ్చే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అందువల్ల, దానిని ఎలా నియంత్రించాలో తెలుసుకోవడం ముఖ్యం. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో మీకు సహాయపడే ఆహారానికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

ఇది కూడా చదవండి.. రోజుకి ఎంత చక్కర తింటే..మధుమేహం రాదు..?

 

కొలెస్ట్రాల్ నియంత్రణ చిట్కాలు..  

 ఏదొక చోట దాదాపు ప్రతిరోజూ గుండెపోటు వల్ల ఎవరొకరు చనిపోతూనే ఉన్నారు. దీనికి అతి పెద్ద కారణం గుండెను జాగ్రత్తగా చూసుకోకపోవడమే. గుండెకు సంబంధించిన చిన్న సమస్య కూడా ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుందో చెప్పలేము. అందువల్ల, మనం గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుండె జబ్బులకు అతి పెద్ద కారణాలలో ఒకటి కొలెస్ట్రాల్ పెరగడం. 

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల, ధమనులు మూసుకుపోవచ్చు, ఇలా జరగడం వల్ల గుండెపోటు,స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ రిస్క్ మరింతగా పెరుగుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, మీరు మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 
కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహార పదార్థాలు..  

కరిగే ఫైబర్ - ఓట్స్, బార్లీ, పండ్లు (ఆపిల్, బేరి), కూరగాయలు (క్యారెట్లు, చిలగడదుంపలు, పప్పుధాన్యాలలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్స్ శరీరం నుంచి కొలెస్ట్రాల్ ను తొలగించడంలో సహాయపడతాయి.

కొవ్వు చేపలు : ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చేపలలో కనిపిస్తాయి. అవి గుండె ఆరోగ్యానికి మంచివి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మంచి పనితీరును కనబరుస్తాయి.

డ్రై ఫ్రూట్స్ - బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు ,పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌లో అసంతృప్త కొవ్వు , ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

సోయా ఉత్పత్తులు - టోఫు, సోయా పాలు, సోయాబీన్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. పండ్లు, కూరగాయలు- చాలా పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు ,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికి మంచివి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

 

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్‌ చిన్నారులకే ఎందుకొస్తుంది..? 

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్‌ లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.