ఆత్మహత్యలను ఎలా నివారించవచ్చు..? 

సాక్షి లైఫ్ : ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. కొందరు తీవ్ర ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పలాడుతున్నారు. అలా చేయడం ఏమాత్రం సరికాదు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలనివారణపై జనాలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంజరుపుకుంటారు. ఈ రోజున, ఆత్మహత్య కేసులను నిరోధించడంలో సహాయపడటానికి ప్రజలకు అవగాహన కలిగించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు, వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

 ఇది కూడా చదవండి..హెమటోలాజిక్ క్యాన్సర్ అంటే ఏమిటి..?

 ఇది కూడా చదవండి..మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తప్పనిసరిగా ఈ ఆరు అవసరం..

 ఇది కూడా చదవండి..ప్యాక్ చేసిన జ్యూస్‌లతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?

 

 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం 2024..

 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న జరుపు కుంటారు.ఈ సంవత్సరం థీమ్ ఆత్మహత్యకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడటానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. సకాలంలో సహాయం అందించడం ద్వారా, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోకుండా నిరోధించవచ్చు. ఒక వ్యక్తి పూర్తిగా నిరుత్సాహానికి గురైనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలుగుతుందని మానసికనిపుణులు చెబుతున్నారు.

అతనికి ఆ సమయంలో జీవితంమీద విరక్తి కలుగుతుంది, తనకు బతకాలనే ఆశా కనిపించదు. అటువంటి సందర్భంలో వారికి ఓదార్పునిచ్చి అండగా నిలబడడం ద్వారా అతన్ని రక్షించడానికి వీలవుతుందని ప్రముఖ సైకాలజిస్టు హిప్నో పద్మాకమలాకర్ చెబుతున్నారు. 

ఆత్మహత్యలను నివారించడానికి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది గ్లోబల్ అవేర్‌నెస్ క్యాంపెయిన్, ఇది ఆత్మహత్యలను నివారించేందుకు అవగాహన పెంచడం, బాధిత వ్యక్తులకు మద్దతుగా నిలవడం లక్ష్యంగా పెట్టుకుంది. "ఆత్మహత్యచేసుకోవాలనే ఆలోచనను మార్చడం", ఇది కేసులను తగ్గించడంలో సహాయపడటానికి ఆత్మహత్య, దాని కారణాల గురించి బహిరంగంగా మాట్లాడటం" ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 నుంచి 2026 సంవత్సరానికి ఈ థీమ్‌ను ఎంచుకుంది.

అందరూ ఆత్మహత్యల నివారణ గురించి మాట్లాడకపోతే వాటిని ఆపలేము. ఈ ఉద్దేశ్యంతోనే ఈ థీమ్ తో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని సెలెబ్రేట్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, ఎంత చిన్న విషయం అయినా, దాని గురించి మాట్లాడాలి, తద్వారా ప్రజలు ఆత్మహత్యల నివారణ గురించి బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మానసిక ఆరోగ్యం గురించి మరింత అవగాహన కలిగి ఉండడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని ప్రముఖ సైకాలజిస్టు హిప్నో పద్మాకమలాకర్ చెబుతున్నారు. 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health mental-tensions mental-health-psychology mental-problems dr-hypno-padma-kamalakar world-suicide-prevention-day-2024 world-suicide-prevention-day suicide-prevention suicide-prevention-day-2024-theme world-suicide-prevention-day-2024-theme world-suicide-prevention-day24 suicide-prevention-day-theme
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com