ఊబకాయం నుంచి పిల్లలను ఎలా కాపాడాలి..?

షేర్ చేయండి:
ఊబకాయం నుంచి పిల్లలను ఎలా కాపాడాలి..?

సాక్షి లైఫ్ : పిల్లలను ఊబకాయం నుంచి కాపాడటానికి కుటుంబ సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలి. అందుకోసం కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ తప్పనిసరిగా మార్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం: పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పాలు, పెరుగు వంటి పోషక పదార్థాలు ఉండేలా చూడాలి. జంక్ ఫుడ్, శీతల పానీయాలు, చిప్స్, అధిక చక్కెర ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి.

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే

ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 

క్రమం తప్పని వ్యాయామం: పిల్లలను కనీసం ఒక గంట పాటు ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. సైకిల్ తొక్కడం, ఆటలు ఆడడం వంటివి అలవాటు చేయాలి. టీవీ, మొబైల్ ఫోన్లు,కంప్యూటర్లకు పరిమిత సమయం కేటాయించాలి.

కుటుంబం పాల్గొనడం: పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు. కాబట్టి, కుటుంబమంతా కలిసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమలో పాల్గొనడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు, సాయంత్రం వేళల్లో కలిసి పార్కులో నడవడం వంటివి చేయవచ్చు.

తగినంత నిద్ర: పిల్లలలు కంటి నిండా నిద్ర చాలా అవసరం. నిద్రలేమి కూడా ఊబకాయానికి ఒక కారణం అవుతుంది. క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు: పిల్లల బరువు,ఎత్తును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ముఖ్యం. ఏమైనా సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా పిల్లలను ఊబకాయ సమస్య నుంచి కాపాడడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచవచ్చు.

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.