గుండె జబ్బుల ప్రమాద కారకాలను ఎలా తగ్గించాలి..?
సాక్షి లైఫ్ : గుండెజబ్బుల విషయంలో 40సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, కొన్ని పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. తద్వారా ప్రమాదాలను గుర్తించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, కల్తీ ఆహారం, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ గంటసేపు నడవాలి, అధిక బరువు కూడా తగ్గించుకోవాలి.
ఇది కూడా చదవండి.. అధికబరువు లేకపోయినా గురక ఎందుకు వస్తుంది..?
మానసిక ఒత్తిడి..
ఉప్పు, చక్కెరతోపాటు కొవ్వు పెంచే ఉత్పత్తులు తీసుకోకూడదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా మంచిది. ప్రతిరోజూ సరిపడా నిద్ర అవసరం. ఛాతీ నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చెక్ చేయించుకోవడం ఉత్తమం. ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలి. అందుకు తగినవిధంగా వ్యాయామం చేయాలి.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ట్రైగ్లిజరైడ్ స్థాయిలు ఎలా ఉండాలంటే..?
150 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే నార్మల్.
150 – 199 ఎంజీ/డీఎల్ ఉంటే కొంతవరకు పరవాలేదు (బార్డర్‌లైన్)
200 – 499 ఎంజీ/డీఎల్ ఉంటే... ఎక్కువ.
500 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే.. ప్రమాదం అని అర్థం.. దీనికారణంగా గుండె జబ్బుల సమస్య పెరిగే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ విషయంలో అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులు అందించిన చికిత్స తీసుకుంటే ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ఆక్సిటోసిన్ పాల వల్ల కలిగే దుష్ప్రభావాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
