హెపటైటిస్ A,E నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి..?
సాక్షి లైఫ్ : వర్షాకాలంలో హెపటైటిస్ A , E కేసులు కూడా వేగంగా పెరుగుతాయి. హెపటైటిస్ A , E కి కారణం కలుషితమైన నీరు, కలుషిత ఆహారం. అయితే, సరైన వైద్య సంరక్షణ, సరైన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకోవచ్చు.హెపటైటిస్ A లేదా హెపటైటిస్ E తో బాధపడుతున్న రోగికి గ్యాస్ట్రో, కాలేయం, మూత్రపిండా లకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు రావచ్చు.
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
వర్షాకాలంలో, ముఖ్యంగా నీరు పేరుకుపోయినప్పుడు, దోమలు ,ఈగలతో పాటు అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్లు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే..?
వర్షాకాలంలో శుభ్రమైన, మంచినీరు,ఆహారాన్ని తీసుకోండి. ఈ సమయంలో, బ్యాక్టీరియా పునరుత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది, కాబట్టి ఏదైనా ఆహార పదార్థాలను బహిరంగ ప్రదేశంలో ఉంచకుండా ఉండండి. అంతేకాదు బయటి ఫుడ్ కు దూరంగా ఉండడం కూడా చాలా మంచిది. కలుషితమైన ఆహారం, నీటి సమస్య కారణంగా అనేక వ్యాధులు వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా నివారించండి..
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
