ఇవి చేస్తే అధిక రక్తపోటు ఖచ్చితంగా అదుపులో ఉంటుంది..
సాక్షి లైఫ్ : అధిక రక్తపోటు సమస్యను ముందుగా గుర్తించడం చాలా అవసరమని చెబుతున్నారు వైద్యనిపుణులు. దీనివల్ల ఆరోగ్యంపావు తీవ్ర ప్రభావం పడుతుందని అందుకోసమే దీనిని అదుపులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇటీవల జనాల్లో అధిక రక్తపోటు సమస్య పెరుగుతోంది. హై బ్లడ్ ప్రెషర్.. దీనినే హైపర్‌టెన్షన్ అనికూడా అంటారు.
ఈ సమస్య వచ్చిందంటే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధిత రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి..? ఏం చేస్తే అటువంటి సమస్య నుంచి ఎలా బయట పడొచ్చు..? అందుకోసం ఏమేం చేయాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
- వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను పూర్తిగా మానెయ్యాలి.
శరీర బరువును తగ్గించుకోవాలి. శరీరానికి ఒత్తిడి, తోపాటు అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండాలి.
-పలురకాల అలవాట్లను మార్చుకోవడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను సమస్యను నియంత్రించవచ్చు.
-వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాల వినియోగం తగ్గించాలి.
మసాలాలు, కారం వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి.
-ఉప్ప వినియోగం చాలా తగ్గించాలి.
-పొగతాగడం, మద్యం సేవించడం మానుకోవాలి.
- ప్రతినిత్యం అర్థగంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి.
- అంతేకాదు నిల్వ పచ్చళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, జంక్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి.
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
