చేతులు, కాళ్ళు జలదరింపు అనిపిస్తే ఏ విటమిన్ లోపానికి సంకేతం..?
సాక్షి లైఫ్ : తరచుగా మీ చేతులు, కాళ్ళలో జలదరింపు అనిపిస్తుందా? దానిని తేలికగా తీసుకోకండి. జలదరింపు అనేది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ, ఇది శరీరంలో ముఖ్యమైన విటమిన్ లోపానికి సంకేతం అని వైద్యనిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో దానిని విస్మరించడం మీకు హానికరం కావచ్చు. ఏ విటమిన్ లోపం వల్ల జలదరింపు వస్తుంది..?
జలదరింపు అనేది ఎవరికైనా సంభవించే ఒక సాధారణ సమస్య. సాధారణంగా శరీరంలో ఓ విటమిన్ లోపం ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. మన శరీరంలో ఇలాంటివి చాలా తరచుగా జరుగుతాయి, దీనికి అసలు కారణం చాలా మందికి తెలియదు. జలదరింపు ప్రతి ఒక్కరూ తరచుగా అనుభవిస్తారు. సాధారణంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల లేదా చేతులు ,కాళ్ళను నొక్కి ఉంచడం వల్ల జలదరింపు అనుభూతిని కలిగిస్తుంది. అయితే, దీని వెనుక ఉన్న అసలు కారణం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. శరీరంలో జలదరింపునకు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలోని కొన్ని భాగాలలో జలదరింపు లేదా తిమ్మిరి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. శరీరంలోని ఏ భాగానికి రక్త సరఫరా సరిగా లేకపోవడం, నరాల దెబ్బతినడం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు శరీరంలో జలదరింపునకు కారణాలు కావొచ్చు. వీటన్నింటికీ ఒక కారణం శరీరంలో ఒక నిర్దిష్ట విటమిన్ లోపమే. అదే విటమిన్ బి12. బి12 విటమిన్ లోపించడం వల్ల శరీరంలో జలదరింపు సమస్య మొదలవుతుంది.
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
