ఈ విధంగా ఆహారంలో ఆలివ్ నూనె వాడితే రుచితోపాటు ఆరోగ్యం కూడా..
సాక్షి లైఫ్ : మీ వంటలో ఆలివ్ నూనెను చేర్చడం ద్వారా, మీరు వంటల రుచిని మెరుగుపరచడమే కాకుండా దాని ఆరోగ్య ప్రయోజనాలను కూడా పెంచుకోవచ్చు. ఇంతకుముందు దీనిని ఎక్కువగా కొన్నిరకాలుగా మాత్రమే ఉపయోగించారు. ఇప్పుడు అన్నిరకాలుగా ఉపయోగిస్తున్నారు. రుచి, మృదువైన ఆకృతి కారణంగా, ఆలివ్ నూనె సలాడ్ నుంచి పాస్తా వరకు అనేక వంటకాల రుచిని పెంచుతుంది. ఇటీవల భారతీయ ఆహారంలో ఈ ఆలివ్ ఆయిల్ ను వాడుతున్నారు. ఆలివ్ ఆయిల్ కూరలు, కూరగాయలు, తందూరి వంటకాలకు సరికొత్త రుచిని అందిస్తుంది, కానీ కొంతమంది దానిని సరైన మార్గంలో ఉపయోగించరు. అసలు మనం వంటలో ఆలివ్ నూనెను ఎలా ఉపయోగిస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఆహారంలో తగినంత ప్రొటీన్‌ని పొందాలంటే..? ఎక్కువగా ఏమి తినాలి..?
ఇది కూడా చదవండి..మగ దోమలు మనుషుల్ని ఎందుకు కుట్టవో మీకు తెలుసా..?
ఆలివ్ నూనె అన్ని రకాల వంటకాలకు ఉత్తమమైంది..
పలు రకాల వంటకాలకు వివిధ రకాల ఆలివ్ నూనెలను ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్ చాలా రుచిగా ఉంటుంది, కాబట్టి దీనిని ఎక్కువగా సలాడ్‌లు, సాటింగ్ , గ్రిల్లింగ్‌లో ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్ వంటకాల రుచిని పెంచుతుంది. కాల్చిన కూరగాయలు, సూప్ లేదా కాల్చిన మాంసాన్ని అందించే ముందు, దానికి కొద్దిగా ఆలివ్ నూనెను యాడ్ చేసుకుంటే రుచిని పెంచుతుంది. అంతేకాదు దీనికి మసాలా దినుసులు జోడించడం ద్వారా మసాలా నూనెగా కూడా ఉపయోగించవచ్చు.
వేయించడానికి..
మీరు వేయించడానికి ఆలివ్ నూనెను ఉపయోగించాలనుకుంటే, భారతీయ వంట కోసం ఆలివ్ ఆయిల్,ఎక్స్‌ట్రా లైట్ ఆలివ్ ఆయిల్‌ని ఎంచుకోండి. డీప్ ఫ్రైయింగ్, మామూలుగా వేయించడం వంటి అన్ని రకాల భారతీయ వంటలకు ఇది సరైనది. గ్రిల్లింగ్ లేదా సాటింగ్ వంటి తక్కువ వేడి వంటలకు ఆలివ్ నూనె సరైనది. మీరు బ్రెడ్ టోస్ట్‌లో వెన్నకి ప్రత్యామ్నాయంగా కూడా ఏ ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించవచ్చు.
బేకింగ్‌లో ఆలివ్ ఆయిల్ అద్భుతం..
బేకింగ్‌లో ఉపయోగించే నూనెలకు ఆలివ్ నూనె గొప్ప ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. కేక్‌లు, మఫిన్‌లు, బ్రెడ్‌లలో ఆలివ్ నూనెను కలపడం వల్ల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. మీ రెసిపీలో వెన్నకు బదులుగా ఆలివ్ నూనెను కూడా ఉపయోగిస్తే దాని టేస్ట్ మరింతగా పెరుగుతుంది..
ఆలివ్ ఆయిల్ నిల్వ చిట్కాలు..
ఆలివ్ ఆయిల్ రుచిని మరింతగా పెంచడానికి, వేడి, వెలుతురు చేరని చల్లని, చీకటి ప్రదేశంలో మాత్రమే ఉంచండి. అప్పుడే ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటుంది.
ఇది కూడా చదవండి..క్రానిక్ పెయిన్స్ కు సర్జికల్ చికిత్స తప్ప మరొక మార్గం లేదా..?
ఇది కూడా చదవండి..పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ లో ఎలాంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
