మీరు తినేది నిజమైన పనీరేనా కాదా..?
సాక్షి లైఫ్ : ప్రస్తుతం మార్కెట్ లో పలురకాల ఆహారపదార్థాలు కల్తీవే ఎక్కువగా దొరుకుతున్నాయి. ఏది తింటే ఏమౌతుందో..? అసలు ఒరిజినల్ ఏది..? కల్తీ ఏది అనేది కూడా గుర్తించలేని విధంగా నకిలీవి తయారుచేస్తున్నారు. ముఖ్యంగా శాఖాహారఆహార ప్రియులు తీసుకునే పనీర్ ను కూడా కల్తీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..ప్రాణాంతక రకాల క్యాన్సర్‌లకు నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా?
ఇది కూడా చదవండి..కోడి గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందా..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ సంకేతాలను ఎలా గుర్తించాలి..?
కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వులు తక్కువ పోషక విలువలు కలిగిన అచ్ఛం పనీర్ ను పోలిన విధంగానే దానిని తయారుచేస్తున్నారు. మీరు ఆర్డర్ చేసే ఏ రెస్టారెంట్ కూడా వాళ్లు అమ్మే పనీర్ పాలతోతయారైనదా..? జంతువుల కొవ్వు లేదా కూరగాయల నూనెలతో తయారు చేసిందా..? అనేది అని వెల్లడించదు.
కూరగాయల నూనెలు లేదా జంతువుల కొవ్వులతో తయారు చేసిన పనీర్ ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నియంత్రిస్తుంది. మీరు రెస్టారెంట్‌కు వెళ్లి పనీర్ డిష్ ఆర్డర్ చేసినప్పుడు సమస్య తెలుస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో పనీర్ డిష్ ఆర్డర్ చేసిన రెస్టారెంట్, పనీర్ పాలు లేదా కూరగాయలు, జంతు నూనెలతో తయారు చేసిందా..? అనే వివరాలు ఏమీ తెలియజేయదు.
పనీర్‌ను పోషకమైనదిగా భావించి మీరు సాంప్రదాయ పనీర్ రుచి, ఆకృతిని అనుకరించి ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులతో తయారు చేసిన అనలాగ్ పనీర్ కూడా ఒరిజినల్ పనీర్ లాగానే ఉంటుంది. అనలాగ్ పనీర్‌ను కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వులు, మైదా పిండి వంటివాటితో తయారు చేస్తారు. ఇది రెస్టారెంట్లకు, హోటళ్లకు ఒరిజినల్ పనీర్ కంటే కల్తీ పనీర్ చౌకగా లభిస్తుంది. అయితే, ఇది అసలు పనీర్ కాదు.
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ అలెర్ట్ : అప్రమత్తమైన తెలంగాణ సర్కార్..
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
