రాత్రిపూట నిల్వ ఉంచిన నీరు తాగడం సురక్షితం కాదా..?
సాక్షి లైఫ్ : నీరు మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించి, ఇతర అవయవాలన్నీ సజావుగా పనిచేసేలా చేస్తుంది. కానీ కొందరు మాత్రం నీరు తాగే విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యల బారీన పడుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. నీరు జీవనాధారం. ప్రతి జీవికి ఇది అవసరం. నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, తప్పుడు మార్గంలో నీటిని తాగడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుందని మీకు తెలుసా. .? నీరు త్రాగడానికి సరైన మార్గం గురించి తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. మీరు తాగే నీరు స్వచ్ఛమైనదా కాదా..? ఎలా తెలుసుకోవాలి..?
రాత్రిపూట..
మనలో చాలా మందికి రాత్రిపూట బాటిల్‌లో నీటిని నింపి, ఉదయాన్నే ఆ నీటిని తాగే అలవాటు ఉంటుంది. ఈ నీరు తాజా కుళాయి లేదా ఫిల్టర్ చేసిన నీటితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. రుచిలో మార్పు కార్బన్ డయాక్సైడ్ వల్ల వస్తుంది. అధ్యయనాల ప్రకారం, నీటిని 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం బయట ఎలాంటి మూత లేకుండా బాటిల్లో గానీ గ్లాసులో గానీ ఉంచితే.. నీటిలో పరమాణు మార్పులు సంభవిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ ఆ నీటిలోకి చేరుతుంది. తద్వారా pH స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా నీరు రుచి మారుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అలాంటి నీటిని తాగడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓపెన్ గా ఉంచిన నీటిలో మురికి, చెత్త ఉండవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.
ఇది కూడా చదవండి.. వేసవిలో వచ్చే ఈ హెల్తీ ఫ్రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి..
ఇది ఎలా హానికరం..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎలాంటి మూత పెట్టకుండా తాగడం సురక్షితం కాదు, ఎందుకంటే మనం ఒక సిప్ తీసుకున్నప్పుడు బాటిల్ లేదా గ్లాస్ అంచుపై ఉన్న బ్యాక్టీరియా నీటిలోకి ప్రవేశిస్తుంది. దీర్ఘకాలంలో ఇది హాని కలిగిస్తుంది. మీరు మీ వాటర్ బాటిల్‌ను అంటువ్యాధి ఉన్న వారితో పంచుకున్నప్పుడు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది." అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
నీరు తాగడానికి సరైన మార్గం ఏమిటి..?
ట్యాప్ లేదా ఫిల్టర్ నుంచి తాజా ఎప్పటికప్పుడు నీరు గ్లాసులోకి తీసుకుని తాగటం మంచిది. మీకు అర్ధరాత్రి లేదా నిద్రలో నీరు త్రాగే అలవాటు ఉంటే..? మీ వాటర్ బాటిల్ కు మూత పెట్టాలి. గ్లాసులో ఉంచితే మూత ఖచ్చితంగా ఉంచండి. ఎల్లప్పుడూ బాటిల్‌ను కడగాలి లేదా బాటిల్‌ని మార్చుతూ ఉండాలి.
ఇది కూడా చదవండి.. ఇండియన్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్.. ఏది బెస్ట్..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
