తెల్ల అన్నం నిజంగా ఆరోగ్యానికి హానికరమా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సరైన ఆహారం ఎంచుకోవడం చాలా ముఖ్యం. మన నిత్యజీవితంలో అన్నం, పండ్ల రసాలు సాధారణం. అయితే, తెల్ల అన్నం తినడం మంచిదా, వద్దా? ఏ రకం బియ్యం ఆరోగ్యానికి మేలు? తెల్ల బియ్యం (పాలిష్ పట్టిన బియ్యం) దేశంలో చాలా మందికి ప్రధాన ఆహారం. రుచిగా ఉండటం వల్ల దీనిని అధికంగా వినియోగిస్తారు. అయితే, ప్రాసెసింగ్ సమయంలో తెల్ల బియ్యం తనలోని ముఖ్యమైన పోషకాలైన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను కోల్పోతుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

 ఇది బరువు పెరగడానికి, మధుమేహానికి దారితీయవచ్చు. జీర్ణ సమస్యలు, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు, మధుమేహ సమస్య ఉన్నవారు తెల్ల బియ్యం తినడం  తగ్గించుకోవడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మన చేతుల్లోనే ఉన్నాయి. తెల్ల బియ్యాన్ని పూర్తిగా మానేయకపోయినా, దాని వినియోగాన్ని తగ్గించి, బ్రౌన్, బ్లాక్, రెడ్ రైస్ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. పండ్ల రసాలకు బదులుగా పండ్లను నేరుగా తినడం వల్ల పూర్తి పోషక ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, వైద్య నిపుణులను సంప్రదించి, వారి సలహా మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం ఉత్తమం. 

 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.